హైదరాబాద్ లో పోలీసులు డ్రంకైన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా వారికి పెద్ద షాక్ తగిలింది. డ్రంకైన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు బైక్ ను ఆపి చెక్ చేయగా బైక్ నడుపుతున్న వ్యక్తి బీరు తాగినట్టు తేలింది. పోలీసులు చలానా కట్టాలని కోరడంతో బైక్ పై ఉన్న వ్యక్తి భార్య నా భర్తను తాగాడంటారా… అయినా ఒక్క బీరు తాగితే తప్పేముంది. అంటూ నిలదీసింది. అవసరమైతే మీరు వైన్స్ షాపులు బంద్ చేయండి. నా మొగుడు తప్పు చేయలేదు. పెళ్లాంగా చెబుతున్నానని ఆమె పోలీసులపై విరుచుకుపడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో కింద ఉంది చూడండి.