మందు తాగి మాట వినని అమ్మాయిలు, డ్రంకైన్ డ్రైవ్ లో పట్టివేత

శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 లో పోలీసులు డ్రంకైన్ డ్రైవ్ చేస్తున్నారు. బంజారహిల్స్ చెందిన అలేఖ్య తన కారులో వస్తుంది. పోలీసులు కారును ఆపి డ్రంకైన్ డ్రైవ్ పరీక్ష చేయాలన్నారు. నేను తాగలేదని వారిని సతాయించింది.

చివరకు లేడి కానిస్టేబుళ్ల సహాయంతో పోలీసులు ఆమెకు డ్రంకైన్ డ్రైవ్ చేశారు. దీంతో ఆమె మందు తాగినట్టు తేలింది. ఫిలిం నగర్ లో మరో యువతి ఉషా అగర్వాల్ కూడా ఈ విధంగానే రచ్చ చేసింది. ఆమె కూడా మందు తాగినట్ట తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.