మెట్రో రైళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్… తాగి రైళ్లెక్కితే రూ.500 ఫైన్

తాగి డ్రైవ్ చేస్తే పోలీసులతో చిక్కులెందుకని తాగుబోతులంతా ఎంచక్కా మెట్రో ట్రైన్ లలో ప్రయాణించి ఇంటికి చేరుకుంటున్నారు. అయితే తాగిన మత్తు దిగేలా మెట్రో అధికారులు ప్రణాళిక రచించారు. తాగి డ్రైవ్ చేస్తే ఎంత జరిమానా వేస్తారో అంతకు డబుల్ మెట్రోలో తాగి ప్రయాణిస్తే వేశారు. ఇది ఎక్కడో కాదు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి ఇబ్బంది ఎందుకు పడాలని భావించే వారు తాగిన తర్వాత మెట్రోలో ప్రయాణించి తమ స్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇలా వారు ప్రయాణించేటప్పుడు కొంతమంది న్యూసెన్స్ చేయడంతో మెట్రో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని సై స్పందించిన మెట్రో అధికారులు  మెట్రోలో తాగి ప్రయాణిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన దానికంటే ఎక్కువ గా జరిమానా వేయాలని నిర్ణయించి దానిని అమలు చేశారు. అలా ఐదేళ్లలో మెట్రోలో తాగి ప్రయాణించిన వారి నుంచి 18 లక్షలు వసూలు చేశారు.

ఇదే విధానాన్ని చైన్నై, హైదరాబాద్ మెట్రోలో కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా చేసి తాగుబోతులకు చెక్ పెట్టాని అధికారులు నిర్ణయించారట.  ఢిల్లీ మెట్రో 2014 నుంచి 2018 వరకు గత ఐదు సంవత్సరాల కాలంలో 3601 మందు బాబుల నుంచి 18 లక్షలు వసూలు చేసింది. తాగి ట్రైన్ ఎక్కితే రూ.500 జరిమానా విధిస్తారు. హైదరాబాద్, చైన్నైలలో కూడా మరో నెల రోజుల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెట్రోకు ప్రయాణికుల నుంచే కాకుండా ఈ విధంగా కూడా ఆదాయం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.