వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు. రాజశేఖర్ తన పాలనతో ప్రజల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికి గుర్తుచేసుకుంటూ ఉంటారు. అయితే నాయకుడు ఎంత విధేయతగా ఉన్న కూడా అధిష్టానం నుండి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీర విధేయుడు అయిన నేత. ఆయన యువ నాయకత్వాన్ని మెచ్చి ఇందిరా గాంధీ కేవలం 33 ఏళ్ళ వయసులోనే పీసీసీ ప్రెసిడెంట్ చేసింది. ఆయన తన కంటే రెట్టింపు వయసు. పవర్ ఫుల్ సినీ గ్లామర్ ఉన్న ఎన్టీయార్ కి ఎదురునిలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అసెంబ్లీలో విపక్ష నేతగా అయనా దాదాపు ఏడేళ్ల పాటు నాటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ తో రాజీలేని రాజకీయ పోరాటం జరిపారు. ఫలితంగా 1989లో కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అపుడు చెన్నారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కచ్చితంగా వైఎస్సార్ కే అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ నేదురుమల్లి జనార్ధనరెడ్డికి చాన్స్ వచ్చింది. ఆ తరువాత కేంద్రం నుంచి తీసుకువచ్చి మరీ విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఇలా ప్రతిసారి ముఖ్యమంత్రి పదవి తప్పిపోతుండటంతో వైఎస్సార్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయి వేరే పార్టీ పెట్టాలని ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఆ పార్టీకి రాజీవ్ కాంగ్రెస్ పార్టీ అని పేరును కూడా ఫిక్స్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే వైఎస్సార్ మాత్రం కాంగ్రెస్ కు విధేయుడిగా ఉంటూ వచ్చారు. ఒకవేళ ఆయన పార్టీ పెట్టి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేవారని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెడితేనే ప్రజలు జగన్ కు అఖండ విజయాన్ని అందించిన ప్రజలు వైఎస్సార్ కు కూడా ప్రజలు బ్రహ్మ రథం పట్టేవారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.