అసలే అలకమీదున్నాడు.. ఆపై కోపం తెప్పించారు.. ఎంపీ టీడీపీలో ఉంటారా ?

War between Kesineni Nani, Budda Venkka
తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఎవరికీ కోపం వస్తుందో ఎవరు ప్లేటు ఫిరాయిస్తారో చెప్పడం కష్టంగా ఉంది.  అసలే పాతృతీ కష్టాల్లో ఉంటే కొందరు నేతలు సొంత ఈగోలకు పోయి చంద్రబాబుకు తలనొప్పులు తెస్తున్నారు.  వారిలో ఎంపీ కేశినేని నాని కూడ ఉన్నారు.  గత ఎన్నికల్లో టీడీపీ నుడ్ని గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని ఒకరు.  విజయవాడ మొత్తంలో టీడీపీ కుదేలయినా  నాని ఒంటరిగా నిలబడి గెలిచారు.  అలాంటి వ్యక్తి పార్టీలో ఎలా ఉండాలి.  అంతా తానై నడిపించాలి.  విజయవాడలో పడకేసిన పార్టీని నీళ్లుకొట్టి మరీ నిద్రలేపాలి.  కానీ పరిస్థితులు చూస్తే మరింత జోకొట్టేస్తున్నారేమో అనిపిస్తోంది.  
 
War between Kesineni Nani, Budda Venkka
War between Kesineni Nani, Budda Venkka
ఎందుకో మొదటి నుండి పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తిగానే ఉన్నారు.  పార్టీలో ఇమడలేకపోతున్నారు.  నిజానికి రఘురామరాజు కంటే ముందే అసమ్మతి స్వరం వినిపించారు నాని.  నేరుగా పార్టీ నేతల మీద విమర్శలు  గుప్పించారు.  తన వ్యతిరేక వర్గాన్ని కొందరు పార్టీ పెద్దలు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.  కానీ చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది.  కానీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ ఒక్కటై రాజకీయం చేస్తుండటం నానికి నచ్చట్లేదు.  ఆ ఇద్దరు నేతలు తమ సొంత వర్గాలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు.  ఎక్కడికక్కడ నానికి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు.  ఫ్లైఓవర్ నిర్మాణంలో కూడ నానికి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. 
 
వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్లో డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన నానిని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకున్నారు.  పార్టీ మారిన వాళ్ళని టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారు, కనీసం పార్టీ కండువా కూడా కప్పుకోలేదని   అలాంటి వారి తరపున ఎలా ప్రచారం చేస్తారు, ఒకే చోట ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్ధులను ఎలా పెడతారని ప్రశ్నించారు.  దీంతో కోపోద్రిక్తుడైన నాని తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని, గతంలో చంద్రబాబు వైసీపీ నుండి తెచ్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు ఆయన్ను తిట్టినవారే కదా, వాళ్లపై పిర్యాదు చేయండి అంటూ మండిపడ్డారు.  కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇలా ఎంపీ, ఎమ్మెల్సీ వర్గాల నడుమ విబేధాలు పొడచూడటం ఆందోళ కలిగించే విషయమే.