ఆరోగ్యశ్రీ కార్డు పొందాలనుకుంటున్నారా.. ఈ కార్డు కోసం అప్లై చేసే విధానం ఇదే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. అయితే ఎన్నో పథకాలు ప్రకటించినప్పటికీ వీటిలో ఆరోగ్యశ్రీ పథకం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. ప్రమాదాల బారిన పడిన వారికి అలాగే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయించుకోవాలంటే పేదవారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీని తీసుకువచ్చింది. ఇలాంటి ఒక అద్భుతమైన పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు
2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు.

ఏ ఒక్కరూ సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఒక డాక్టర్ గా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పథకం ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలను నిలబెట్టిందని చెప్పాలి అయితే ఇలా ప్రభుత్వం తరఫున ఉచితంగా వైద్యం చేయించుకోవాలంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు అవసరమవుతుంది మరి ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా పొందాలి, ఆరోగ్యశ్రీ పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనే విషయానికి వస్తే…

ఆరోగ్యశ్రీ కార్డు పొందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డ్ ఉన్నవారు మాత్రమే ఈ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు. అదేవిధంగా వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయలకు మించి ఉండకూడదు. ఏపీ ప్రభుత్వం నుంచి జగనన్న విద్యా దీవెన,వైయస్సార్ పెన్షన్ వంటి పథకాలు పొందిన వారు కూడా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులే అలాగే ప్రవేట్ ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఈ కార్డు పొందడానికి అర్హులు. ఎంతో ప్రయోజనకరమైన ఈ ఆరోగ్యశ్రీ కార్డు పొందాలంటే మన ఫ్యామిలీ ఫోటోతో పాటు ఆ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అలాగే రేషన్ కార్డును తీసుకెళ్లి మన గ్రామ సచివాలయంలో అధికారులకు అప్లికేషన్ సమర్పించాలి.ఇలా గ్రామ సచివాలయంలో వీటన్నింటిని సమర్పించిన 15 నుంచి నెల రోజుల వ్యవధిలో డైరెక్ట్ పోస్టల్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు నేరుగా మన ఇంటికి వస్తుంది.