సరదాగా అన్నారో, సీరియస్‌గానే అన్నారో.. పవన్ కళ్యాణ్ ‘నేనూ విశాఖకి వచ్చేస్తా..’ అంటూ చేసిన వ్యాఖ్యలిప్పుడు, పొలిటికల్ సర్కిల్స్‌లో కామెడీ అయిపోయాయ్.! జనసేన పార్టీని స్థాపించింది మొదలు.. ఆయన హైద్రాబాద్‌లోనే ఎక్కువగా వుంటున్నారు.
తరచూ మంగళగిరి వచ్చి వెళుతుంటారు. గతంలో అయితే, ఆర్నెళ్ళకోసారి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేవారాయన. ఈ మధ్య తరచూ వస్తున్నారు.. అంతే తేడా.! హైద్రాబాద్ నుంచి పూర్తిగా మకాం మంగళగిరికి మార్చేశారు పవన్ కళ్యాణ్.. అంటూ ప్రచారం జరిగింది.
సినిమా షూటింగులు కూడా మంగళగిరి పరిసరాల్లోనే వుండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే, ఆయన ‘ఛలో విశాఖ’ అంటున్నారు. వీలైతే, విశాఖపట్నంలో ఇల్లు తీసుకుని, పార్టీ కార్యాలయాన్ని స్థాపించి.. ఇక్కడే వుండిపోతానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు.
అంతలోనే, ఆయన మాట మార్చేశారు. ‘మీ ఫోన్ కాల్‌కి గంట దూరంలో వుంటాన్నేను.. ఫోన్ చేసిన గంటలోపు మంగళగిరి నుంచి విశాఖ వచ్చేస్తా విమానంలో..’ అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
అదెలా కుదురుతుంది.? అంత ఇబ్బంది పడే బదులు.. విశాఖకు షిఫ్ట్ అయిపోవచ్చు కదా.? విశాఖలో అయితే, సినిమా షూటింగులకీ అనుకూలంగా వుంటుందనే సెటైర్లు పవన్ కళ్యాణ్ మీద పడుతున్నాయ్. మొన్నామధ్య చిరంజీవి కూడా, ‘నేనూ విశాఖలో ఇల్లు కట్టుకుంటా..’ అని చెప్పారు.
అన్నట్టు, వచ్చే నెలలో విశాఖకు కాపురం మార్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే.