ఏపీలో ఉపఎన్నికల దిశగా జగన్ అడుగులు వేయనున్నారా.. వాళ్లకు షాక్ తప్పదా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఉపఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కొన్ని స్థానాల్లో గెలవడం వైసీపీ ఎమ్మెల్యేల సహాయసహకారాల వల్లే ఈ విధంగా జరగడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసిన సంగతి తెలిసిందే.

 

సస్పెండ్ తర్వాత ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి వైసీపీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల సపోర్ట్ వైసీపీకి పుష్కలంగా ఉంది. జగన్ ఉపఎన్నికల దిశగా అడుగులు వేస్తే వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 

ఉపఎన్నికలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడక అని అయితే సరైన అభ్యర్థుల ఎంపిక మాత్రం ఎంతో ముఖ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని వదిలేసి కష్టపడితే మాత్రం అనుకూల ఫలితాలు రావడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఏ విధంగా ముందుకెళ్లనుందో చూడాల్సి ఉంది. వైసీపీ ఫ్యాన్స్ మాత్రం వైసీపీ మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్నారు.

 

కొన్ని స్థానాలలో టీడీపీ గెలిచినంత మాత్రాన పొంగిపోవడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడం కూడా టీడీపీకి అసాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జనసేన పుంజుకోవడం కూడా తేలిక కాదనే సంగతి తెలిసిందే.