టీడీపీ – బీజేపీ – జనసేన… సాయిరెడ్డి తాజా విశ్లేషణ!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్షాలు దూకుడు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే విమర్శలు ప్రతివిమర్శలకు తోడు మైండ్ గేంస్ సైతం స్టార్ట్ చేశాయి. ఈ విషయంలో అధికార వైసీపీ కాస్త దూకుడుమీదుందనే చెప్పాలి. ఈ సమయంలో ఆ పార్టీ ఎంపీ కీలక విశ్లేషణ చేశారు.

అవును… తనమార్కు మైండ్ గేం లో భాగంగా తాజాగా ఒక ట్వీట్ చేశారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇందులో భాగంగా… విపక్ష పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా ఉండబోతోందనేది విశ్లేషించారు. ఇదే సమయంలో వైసీపీ కంటే విపక్షం ఎంతో దూరంలో ఉండబోతోందంటూ మరో బాణం వదిలారు.

అదేవిధంగా… రెండో స్ధానం కోసం విపక్ష పార్టీలైన టీడీపీ-బీజేపీ-జనసేన లు పోటీ పడుతున్నాయంటూ చెప్పుకొచ్చిన సాయిరెడ్డి… ఎవరి ఓట్లు ఎవరికి ఎలా బదిలీ అవుతాయో కూడా తన ట్వీట్ లో స్పష్టం చేశారు. ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో ఎక్కడో దూరంలో రెండో స్ధానం కోసం గట్టి పోటీ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో అలాగే టీడీపీ సానుభూతిపరుల ఓట్లు జనసేనకు పడేలా అండర్ కరెంట్ ఉందని సాయిరెడ్డి తెలిపారు. అలాగే జనసేన ఓటర్లు బీజేపీకి షిప్ట్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఏదేమైనా విపక్షాలు 2024ను వదిలిపెట్టి 2029 కోసం సన్నాహాలు మొదలుపెట్టాలని విజయసాయిరెడ్డి సూచించారు.

అవును… 2024 ఎన్నికల్లో అధికార వైసీపీకి 51 శాతానికి పైగా ఓటు శాతం సాధిస్తుందని విజయసాయిరెడ్డి విశ్లేషించారు. ఈ సమయంలో… విపక్షాలు 2024పై ఆశలు వదులుకని 2029పై దృష్టిపెట్టాలని సూచించారు. ఏది ఏమైనా… గిల్లడం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ గిల్లలేరన్నట్లుగా సాయిరెడ్డి తన సెకండ్ ఇన్నింగ్స్ లో ట్వీట్ల వర్షాలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో… “బెంజమిన్ ఫ్రాంక్లిన్, మైఖేల్ ఫారెడిలను మించి పోయారు చంద్రబాబు గారు. సరికొత్త పద్దతిలో విద్యుత్ కనిపెట్టారు – మైక్ ఇస్తే చాలు ఎదో మాట్లాడటం. రెండ్రోజుల తర్వాత గాలి, నీరు కూడా తానే కనిపెట్టా అంటారు కాబోలు! హతవిధీ!” అంటూ బాబుకి చురకలేశారు.