హైదరాబాద్ ఓ యువ జర్నలిస్టు అరెస్ట్ చుట్టూ ఉదయాన్నే రాజకీయంగా భారీ హడావుడి చోటుచేసుకుంది. సీనియర్ జర్నలిస్టు, సాక్షి టీవీలో ఇన్‌పుట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసు బృందం, ముందుగానే అరెస్ట్ చెయ్యడంపై వివాదం చెలరేగింది. 50 నిమిషాలపాటు వాగ్వాదం జరిగిన అనంతరం, ఆయన్ను విజయవాడకు తరలించారు.
అరెస్టు సమయంలో కొమ్మినేని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించినా, పోలీసులు పూర్తి వివరాలు చెప్పకుండానే “స్టేషన్‌కు వచ్చాక చెప్తాం” అంటూ సమాధానం ఇచ్చారు. ఈ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాను అమరావతిపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, తనకు అవన్నీ సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, తన పేరున వదిలిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టు వెల్లడించారు.
ఇప్పటికే అమరావతి అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మరో జర్నలిస్టు కృష్ణంరాజు కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ వదిలి ఎక్కడికైనా వెళ్లిపోయినట్టు సమాచారం. మరోవైపు ఆదివారం మహిళలు భారీగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కేసు వేగంగా ముందుకు సాగింది. అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.