బిగ్ న్యూస్: మార్గదర్శిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు… ఉండవల్లి పోరాటం ఫలించిందా?

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుకు మార్గదర్శి ఇష్యూలో తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది! గతకొన్ని రోజులుగా సంచలనాలకు వేదికవుతున్న “మార్గదర్శి మోసాలు” అనే అంశంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ ఉదంతంలో తాజా పరిణామం అత్యంత కీలకమైనదిగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మార్గదర్శి వ్యవహారంలో తన పోరాటం ఫలించిందని సగర్వంగా, సంతృప్తిగా చెబుతున్నారు!

అవును… మార్గదర్శికి సంబంధించిన డిపాజిట్ల వివరాల్ని బయటపెట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మార్గదర్శిలో పెట్టిన పెట్టుబడులు ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయటపెట్టటంలో రహస్యం ఎందుకు? అంటూ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శిపై ప్రశ్నల్ని వర్షం కురిపించింది! మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసుపై జస్టిస్ సూర్య కుమార్.. జస్టిస్ జెబీ పర్డీవాలా ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.

2,600 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎక్కడ నుంచి వచ్చాయని, డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారని, చెక్కుల రూపంలో ఇచ్చారా లేక మరో రూపంలో ఇచ్చారా అన్నది తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది! డిపాజిటర్లకు చెల్లింపులు చేసిన తర్వాత.. ఆ వివరాల్ని బయటపెట్టటంలో మీకున్న అభ్యంతరం ఏమిటంటూ ప్రశ్నించింది! ఈ సందర్భంగా మార్గదర్శి వాదనలపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. “ఒకవైపు హెచ్.యు.ఎఫ్ అని మరోవైపు ప్రొపైటరీ కన్సర్న్ అంటూ చెప్పటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది!

ఇదే విషయాలపై స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… ఇదొక కీలక మరిణామనని, తన 17ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని.. మార్గదర్శిలో డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని సుప్రీం ఆదేశించిందని తెలిపారు!

కాగా… ఇదే విషయాలపై ఉండవల్లి కొన్ని వందల సార్లు మార్గదర్శి మేనేజర్లను, రామోజీ రావును అడిగారు. ఇప్పటికే చెల్లింపులు అయిపోయినవారి వివరాలు బహిర్గతం చేయాలని, ఏ రూపంలో చెల్లించాలో చెప్పాలని కోరిన సంగతి తెలిసిందే. నాడు ఉండవల్లి మాటలను లైట్ తీసుకున్న మార్గదర్శి యాజమాన్యం… తాజా సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో వివరాలు బయట పెట్టడం అనివార్యమైంది!