Undavalli Arun Kumar: ఉండవల్లి ఇంట్లో భేటీ అయిన వైసీపీ మాజీలు… అసలేం జరగబోతోంది?

Undavalli Arun Kumar: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తి చేసుకుంది. ఏడాదిన్నర కాలంలో వైసిపిని టార్గెట్ చేయడం కోసం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వైసీపీని పూర్తిస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.ముఖ్యంగా మద్యం స్కాంలో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. త్వరలోనే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేయబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే వైసీపీకి చెందిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు.

రాజమండ్రి జైలులో ఉన్న ఎంపీ మిధున రెడ్డిని మూలఖత్ లో భాగంగా కలవడం కోసం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి,వైసీపీ నాయకుడు సుగవాసి వంటి తదితరులు జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించారు అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి చేరారు అక్కడ ఆయనతో కీలక సమావేశాన్ని నిర్వహించారని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను రాజకీయ మేథావిగా పేరుంది. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్దితులను ఉండవల్లితో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తోంది. అదేవిధంగా కూటమిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు కూడా కోరి ఉండొచ్చని సమాచారం. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో పలు సందర్భాలలో వైసీపీకి అనుకూలంగానే పలు వ్యాఖ్యలు చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా తరచూ ఎన్నో కీలక సలహాలు సూచనలు ఇచ్చేవారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన ఎంపీగా బాధ్యతలను చేపట్టారు. ఇక ఆయన మరణాంతరం జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయటంతో ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే తిరిగి ఈయన త్వరలోనే రాజకీయాలలోకి రాబోతున్నారు అంట కూడా గతంలో వార్తలు వినిపించాయి కానీ ఇప్పటివరకు పొలిటికల్ ఎంట్రీ గురించి ఈయన ఏమాత్రం స్పందించలేదు తాజాగా వైసీపీ మాజీ లందరూ ఆయనతో భేటీ కావడంతో వైసీపీలో ఏం జరగబోతుంది అనే చర్చలు మొదలయ్యాయి.