ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించిన వైయస్సార్ కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణిని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు అభినందించారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం శనివారం తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ ను శ్రీ చరణీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆమెను శాలువతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తు లో క్రికెట్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆకాంక్షించారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా శ్రీచరణికి అభినందనలు తెలిపారు.

