TTD: తిరుమల ఘటన పై స్పందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు…. ఏం చేయలేమంటూ?

TTD: తిరుమల వైకుంఠ ద్వారం దర్శన టికెట్ల టోకెన్ జారీ చేయడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే .ఈ తొక్కిసలాటలో భాగంగా 6 మంది మరణించడం ఎంతోమంది గాయాలు పాలయ్యారు. ఇలా గాయాల పాలైన వారందరిని కూడా తిరుపతిలోనే పలు ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలి అంటూ చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ ఘటన గురించి స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అయితే ఈ ఘటన గురించి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బి.ఆర్ నాయుడు స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు .ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ…ఇదొక దురదృష్టకర సంఘటన చింతించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఎవరూ ఏం చేయలేరు.. దైవ నిర్ణయం.

పరిపాలనా లోపం వల్లే తొక్కిసలాట. గొడవలు జరుగుతాయని ముందే తెలుసు అంటూ ఈయన ఈ ఘటనపై స్పందించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా తనకు ఫోన్ చేసి మరి ఘటనకు గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి అడిగి తెలుసుకున్నారని బి ఆర్ నాయుడు తెలిపారు.

సమీక్షా సమావేశాలలో, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని టిటిడి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇలా ఈ ఘటన గురించి బి ఆర్ నాయుడు స్పందించిన విధానంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి ఏమాత్రం బాధ్యత లేనటువంటి స్టేట్మెంట్ ఇది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరుమాత్రం ఈ ఘటనకు మీరే బాధ్యులు సరైన స్థాయిలో ఏర్పాట్లను చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అంటూ ఈ ఘటన తో చైర్మన్ పై విమర్శలు కూడా కురిపిస్తున్నారు.