2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించాల్సింది ఎవరు.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా 2024 ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే చూశారు ఆ పార్టీకి ఓటేసిన ఓటర్లంతా.! సాధారణంగా ఏ రాజకీయ పార్టీ విషయంలో అయినా దాపు ఇలాగే వుంటుంది. కానీ, కొన్ని చోట్ల అభ్యర్థుల ఇమేజ్ ఆయా పార్టీలకు అదనపు లాభం అవుతుంది.

కానీ, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరి వల్లా వైసీపీకి అదనపు ప్రయోజనం ఏమీ లేదు. కేవలం వైఎస్ జగన్ ఇమేజ్, ఆ పార్టీని గెలిపించింది. అధికారంలోకి రావడానికి జగన్ ఇమేజ్ ఉపయోగపడింది వైసీపీకి. మరి, ఆ అధికారం నిలబెట్టుకోవాలంటే.? ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా అందరి పాత్రా అత్యంత కీలకం.! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి చెంప పెట్టు లాంటివేనన్నది నిర్వివాదాంశం. వైఫల్యాల్ని అంగీకరించి, ఆత్మవిమర్శ చేసుకుంటేనే వైసీపీ ‘వై నాట్ 175’ అనే మాటను నిజం చేసుకోగలుగుతుంది. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఎలా సాధ్యమైంది.? అన్నదానిపై అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే.

జనసేన పార్టీని విమర్శించడమో, టీడీపీని తూలనాడటమో వైసీపీకి మేలు చేయదు. కేంద్రాన్ని నిలదీసి, రాష్ట్రానికి వైసీపీ సర్కారు ఏం సాధించింది.? అన్న దిశగా జనం లెక్కలేసుకుంటారు. ‘అప్పులు చేసి పంచుతున్నారు.. అందులో గొప్పేముంది.?’ అన్న భావన సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో కలుగుతోంది.

గ్రాడ్యుయేట్లు గనుక, తమ పరిధిలోని సాధారణ ఓటర్లను చైతన్యవంతుల్ని చేయగలిగితే, 2024 ఎన్నికల్లో పలితాలు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా మారతాయ్. చేసిన, చేయాల్సిన అభివృద్ధిని మాత్రమే ప్రజలకు చెప్పగలిగి, చూపించగలిగితేనే.. వైసీపీకి ‘ఊపిరి’.! లేదంటే, అంతే సంగతులు.!