ఫ్రెండ్లీ పోలీసుల దుమ్ము దులిపిన కోదండరాం, అరెస్ట్ (వీడియో)

తెలంగాణలో కోదండరాం మీద మల్లా తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు పగ పట్టిర్రా అన్న అనుమానాలు కలిగేలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కోదండరాం హైదరాబాద్ దాటి కాలు బయట పెడితే పోలీసులు కోదండరాం కారుకు అడ్డం పడి అరెస్టు చేసేవాళ్లు. ఆయన జెఎసి ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే హైదరాబాద్ పొలిమేరలు దాటగానే అరెస్టు చేసేవారు. కొన్నిసార్లు ఆయన ఇంట్లె నుంచి బయటకొచ్చినా అరెస్టు చేసేవారు. ఒకసారైతే కోదండరాం ఇంటి తలుపులు బద్ధలుకొట్టి మరి అర్ధరాత్రి పూట అరెస్టు చేసి హైదరాబాద్ లోని పోలీసు స్టేషన్లలో తిప్పారు.  తాజాగా మళ్లీ ఆ పరిణామాలు రిపీట్ అవుతున్నాయి. నిజామాబాద్ లో నీటి విడదల కోసం రాస్తారోకో చేసి అరెస్టయిన రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన కోదండరాం ను తెలంగాణ పోలీసులు బిక్నూరు టోల్ గేట్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు. 

నిజామ్ సాగర్ కింద రైతులు లీకేజీ వాటర్ ను విడుదల చేయాలంటూ హైవే మీద భారీ రాస్తారోకో జరిపారు. ఈ సందర్భంగా పలు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే రైతు సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జైలులో ఉన్న వారిని పరామర్శించేందుకు కోదండరాం సోమవారం నిజామాబాద్ బయలుదేరారు. దీంతో కోదండరాం కు అనుమతిలేదంటూ బిక్నూరు టోల్ గేట్ వద్ద పోలీసులు అటకాయించారు. ఆ సమయంలో కోదండరాం పోలీసుల మీద ఫైర్ అయ్యారు తననను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ నిలదీశారు. పోలీసులను కడిగిపారేశారు. ముందుస్థు అరెస్టు అంటూ పోలీసులు చెప్పిన సమాధానంపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో కోదండరాం వాగ్వాదం వీడియో కింద ఉంది చూడండి.

 

అరెస్టయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే అరెస్టు తనను అరెస్టు చేయడం దారుణమన్నారు కోదండరాం. కోదండరాం తోపాటు అరెస్టయిన వారిలో టిజెఎస్ రాష్ట్ర నాయకులు గోపాలశర్మ, రతన్ రావు, విద్యార్థి యువజన నాయకులు రమేష్ ముదిరాజ్, సలీంపాష, సర్దార్ వినోద్ కుమార్, బాబూ మహాజన్, రెడ్డి శ్రీనివాస్, శివరాత్రి ప్రశాంత్ ఉన్నారు. మరో వీడియొ కింద ఉంది చూడండి.

కోదండరాం పోలీసులతో వాగ్వాదం చేస్తున్న సందర్భంలో జన సేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.