జగన్ కు చంద్రబాబుకు తేడా ఇదే.. అక్కడి ప్రజలు కూడా నమ్మట్లేదుగా బాబు?

ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. అయితే రాయలసీమ ప్రజలు జగన్ ను నమ్మిన స్థాయిలో చంద్రబాబును మాత్రం నమ్మడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ ప్రభంజనం కొనసాగే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. టీడీపీ సింగిల్ గా పోటీ చేసినా జనసేనతో కలిసి పోటీ చేసినా ఫలితాలు మాత్రం మారవని సమాచారం.

చంద్రబాబును కుప్పంలో ఓడించాలని జగన్ ఫిక్స్ కావడంతో చంద్రబాబు నాయుడు ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రాయలసీమ ప్రజలంతా జగన్ ను నమ్ముతుంటే చంద్రబాబు చివరకు కుప్పం ప్రజల నమ్మకాన్ని సైతం కోల్పోయారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా రాయలసీమకు ఆయన వల్ల కలిగిన ప్రయోజనాలు శూన్యం అని చాలామంది భావిస్తారు. రాయలసీమలోని 52 స్థానాలు ఉండగా 50కు పైగా స్థానాలలో విజయం గ్యారంటీ అని వైసీపీ కాన్ఫిడెన్స్ తో ఉండటం గమనార్హం. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో అక్కడి ప్రజల మద్దతు కూడా వైసీపీకే ఉంటుందని ఆ పార్టీ భావిస్తుండటం గమనార్హం.

గోదావరి జిల్లాలు మాత్రమే టీడీపీ జనసేన పార్టీలకు అనుకూలంగా ఉండగా ఈ రెండు జిల్లాలలోని నియోజకవర్గాలపై కూడా జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. 2024 ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఏపీలో ప్రభావం చూపాలని బీజేపీ భావిస్తుండగా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సి ఉంది.