సోలోగా జనసేనకు గెలిచే సత్తా అయితే లేదా..?

ప్రముఖ రాజకీయ పార్టీలలో ఒకటైన జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఏపీలో నామమాత్రంగా కూడా ప్రభావం చూపలేక ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే. మరో పార్టీతో పొత్తు లేకుండా జనసేన 2024 ఎన్నికల్లో పోటీ చేసినా ఇవే ఫలితాలు పునరావృతం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించకపోవడమే ఇందుకు కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రజారాజ్యం పార్టీ సాధించిన స్థాయిలో కూడా జనసేన సీట్లను సొంతం చేసుకోలేదంటే ఆ పార్టీపై ప్రజల్లో ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థమవుతుంది. కొంతమంది పవన్ అభిమానులు “పవన్ ను అభిమానిస్తా జగన్ కు ఓటేస్తా” అని చెబుతూ సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉన్నా రాజకీయాలకు సంబంధించి మాత్రం జగన్ పై మాత్రమే తమకు అభిమానం ఉందని తేల్చి చెబుతుండటం గమనార్హం.

జనసేన ఎప్పుడూ మరో పార్టీపైనే ఆధారపడుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు లేకపోతే జనసేనకు రాష్ట్రంలో నామమాత్రపు గుర్తింపు కూడా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్, పవన్ అభిమానులు ఈ విషయాలను నమ్మకపోయినా వాస్తవాలు మాత్రం ఇవేనని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు టీడీపీ జనసేనకు ఓడిపోయే నియోజకవర్గాలను కేటాయించనుందని సమాచారం.

వైసీపీ కంచుకోటలుగా పేరు ఉన్న నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. గత ఎన్నికలో గెలిచిన నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడానికి టీడీపీ ఇష్టపడటం లేదు. పవన్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటుండగా ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది.