టీడీపీ రెబల్స్ తో జనసేనకు నష్టం తప్పదా.. పార్టీ నేతలు ఏమంటారో?

Pawan Kalyan turned himself as Senani.. Janasenani

2024 ఎన్నికలకు మరో 17 నెలల సమయం మాత్రమే ఉండగా వైసీపీ అభ్యర్థుల ఎంపికను ఇప్పటికే పూర్తి చేస్తే టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపికను మొదలుపెట్టింది. జనసేన 40 స్థానాలు కావాలని కోరుతుండగా జనసేనతో పొత్తు వల్ల అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ అందుకు అంగీకరిస్తోందని సమాచారం అందుతోంది. అయితే టీడీపీ రెబల్స్ తో జనసేనకు నష్టం తప్పదని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.

అయితే జనసేనకు టీడీపీ 40 స్థానాలను కేటాయించినా ఆ స్థానాలలో టీడీపీ నేతల నుంచి జనసేనకు సపోర్ట్ లభిస్తుందని కచ్చితంగా చెప్పలేము. ఆ స్థానాలను ఆశించిన అభ్యర్థులు జనసేన అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. టీడీపీ రెబల్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నష్టపోయే పార్టీ ఏదనే ప్రశ్నకు కూడా జనసేన పేరు సమాధానంగా వినిపిస్తూ ఉండటం గమనార్హం.

టీడీపీ జనసేన కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం తేలిక కాదని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాలను గమనించి అన్ని లెక్కలు వేసుకుని అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. స్థానికంగా మంచి పేరు ఉండటంతో పాటు రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థులను జనసేన ఎంపిక చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఆ నేతలు ఆర్థికంగా కూడా బలంగా ఉంటే పార్టీకి మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. జనసేన 2024 ఎన్నికల్లో మరీ సంచలనాలు సృష్టించకపోయినా పోటీ చేసిన నియోజకవర్గాలలో కనీసం సగం నియోజకవర్గాల్లో గెలిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తుండటంతో వైసీపీ ఇప్పటికే ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలుస్తోంది.