లిఫ్ట్ ఇస్తానని బామ్మని నమ్మించి సర్వం దోచుకున్న దుర్మార్గుడు… లబోదిబోమంటున్న బామ్మ?

ప్రస్తుత కాలంలో మహిళలు వృద్ధులు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే కొంత మంది వెధవలు వారి కామ వాంఛలు తీర్చుకోవటానికి వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నారు. మరికొందరు ఆకతాయిలు కష్టపడి డబ్బు సంపాదించలేక బంగారం ధరించి రోడ్డు మీద వెళ్ళే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్లు కూడా రూటు మార్చారు. సహాయం చేస్తామని నమ్మించి మొత్తం దోచుకుంటున్నారు. ఇటీవల ఏలూరు జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే… ఇటీవల ఒక వృద్ధ మహిళ ఏలూరు జిల్ల కొయ్యలగూడెం మండలం గంగవరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఒక వ్యక్తి ఆ వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ద్విచక్ర వాహనం మీద ఎక్కించుకున్నాడు. దేవులపల్లిలో దింపుతానని చెప్పి బామ్మను నమ్మించాడు. ఎక్కువ దూరం నవడలేని పరిస్థితులలో ఉన్న బామ్మ నిజంగా సహాయం చేస్తున్నాడని నమ్మి అతని వెంట వెళ్ళింది. అయితే రోడ్డు మీద ఎవరు లేకపోవటం గమనించిన సదరు నిందితుడు దేవులపల్లి లక్కవరం మధ్యలోకి వచ్చేసరికి వృద్ధురాలిని కిందికి దింపేసాడు.

ఆ దారిలో ఎవరు రాలేదని గమనించి వెంటనే ఆమె మెడలో ఉన్న మూడు కాసుల బంగారపు గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనం మీద దేవులపల్లి వైపు పరారయ్యాడు. దీంతో వృద్ధురాలు మోసపోయానని గ్రహించి మూడు కాసుల బంగారం దోచుకెళ్లిపోయాడు అంటూ కన్నీటి పర్యంతమైంది. అనంతరం స్థానికుల సహాయంతో వృద్ధురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్దురాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలిసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బంగారం దొంగలించి పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.