దెంట్లో నెగెటివ్ వచ్చినా ఈ పాయింట్ మీద మాత్రం సుప్రీం లో జగన్ కి పాజిటివ్ గ్యారెంటీ?

YS Jagan compromise to reduce liquor rates 
విజ‌య‌వాడ ర‌మేష్ ఆసుప‌త్రి నిర్ల‌క్ష్యం కార‌ణంగా 10 మంది స‌జీవ‌ద‌హ‌నమైన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. యాజ‌మాన్యం నిర్లక్ష్యం కార‌ణంగా ఘ‌ట‌న చోటు చేసుకుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసింది.  స‌రిగ్గా ఆసుప‌త్రిపై చ‌ర్య‌ల‌కు రెడీ అవుతోన్న స‌మ‌యంలో ర‌మేష్ ఆసుప‌త్రి యాజ‌మాన్యం హైకోర్టును ఆశ్ర‌యించి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు తెచ్చుకుంది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ramesh hospitals
ramesh hospitals

10 మంది మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ర‌మేష్ ఆసుప‌త్రి యాజ‌మ‌న్యంపై చ‌ర్య‌ల‌కు అనుమ‌తివ్వాల‌ని, హైకోర్టు తీర్పు పై స్టే విధించాల‌ని ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు దాఖ‌లు చేసిన  పిటీష‌న్ లో పేర్కొంది. ర‌మేష్ ఆసుప‌త్రి యాజ‌మాన్యం ద‌ర్యాప్తునకు స‌హ‌క‌రించ‌లేద‌ని, నిర్వ‌హ‌ణ‌లో లోపాలున్నాయ‌ని…చ‌ర్య‌లు తీసుకునేందుకు అనుకూలంగా తీర్పునివ్వాల‌ని పిటీష‌న్ లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో పిటీష‌న్ పై  ర‌మేష్ ఆసుప‌త్రి యాజ‌మాన్యం కౌంటర్ దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది.  ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు కేసుల్లో జ‌గ‌న్ స‌ర్కార్ కు హైకోర్టు, సుప్రీంకోర్టుల‌లో భంగ‌పాటు ఎదురైన సంగ‌తి తెలిసిందే.

హైకోర్టు తీర్పుల‌ను స‌వాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లిన నేప‌థ్యంలో  అక్క‌డా తిప్ప‌లు త‌ప్ప‌లేదు. అయితే ర‌మేష్ ఆసుప‌త్రి యాజ‌మాన్యం విష‌యంలో జ‌గ‌న్ కు అనుకూల‌మైన తీర్పు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ర‌మేష్ ఆసుపత్రి నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఘ‌ట‌న జ‌ర‌గ‌డం..అటుపై స్వ‌ర్ణ‌ ప్యాలస్ ఓన‌ర్..ర‌మేష్ ఆసుప‌త్రి అధినేత ప‌రార‌వ్వ‌డంతో పాటు ప‌లు ర‌కాలుగా వాళ్ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం వ‌ద్ద  బ‌ల‌మైన ఆధారాలు  కూడా  ఉన్నాయి.  ఈ నేప‌థ్యంలో ర‌మేష్ ఆసుప‌త్రి కేసు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్  పైచేయి సాధించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.