ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసింది. ఈ నెల 29 న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ అధ్యక్షులు దిశా నిర్ధేశం చేశారని, పోలవరం 1050కోట్ల బకాయిలు రావాల్సి ఉంది అని నూతన అంచనాల ప్రకారం అంచనా 56 వేల కోట్ల కు ఆమోదింప చేయడానికి ఎంపీ లు కృషిచేయలని సూచించారని ఆయన అన్నారు.
16 మెడికల్ కాలేజ్ లకు 3 అనుమతి వచ్చాయి.. మరో 13 కాలేజ్ లకు త్వరలోనే అనుమతి సాధిస్తాం అని స్పష్టం చేసారు. నివర్ తుఫాన్ నిధులు, ఎన్డిఅర్ఆఫ్ నిధులు 2 వేల కోట్లు రాబట్టాలని సీఎం సూచించారు అని అన్నారు. పవర్ పర్చేజి అగ్రిమెంట్లు లో 2 ప్రాజెక్ట్ ల విషయం లో 800 కోట్లు ఆదా అయింది అని అన్నారు. దిశ బిల్లు సవరణ చట్టం కు ఆమోదం పొందేలా కృషి చేయాలని చెప్పారని ఆయన అన్నారు. హైకోర్టు ను కర్నూల్ కు తరలించే విషయం లో రీ నోటిఫికేషన్ చేయాల్సిన అంశం పై కేంద్రం తో చర్చించాలని ఆదేశించారు అని అన్నారు.
మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పనిదినాల పెంపు తోపాటు,రెవిన్యూ లోటు రాబట్టాలి అని సూచించారని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టే 11 బిల్లులు పై అనుసరించాల్సిన వ్యూహం చర్చించాం అని ఆయన తెలిపారు. వ్యవసాయ చట్టాల పై దిశ దశ నిర్ధేశించారు అని ఆయన పేర్కొన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి అదే నినాదం తో ముందుకు వెళ్లాలని, కండిషన్ ల తో వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చాము. కండిషన్ లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. దేవాలయాల విద్వoసాల్లో టిడిపి వారి ప్రమేయం ఉంది. ఆధారాలు ఉన్నాయి.అవి అన్ని పార్లమెంట్ ముందుపెడతాం అని ఆయన స్పష్టం చేసారు.