అందుకే చంద్రబాబు ని అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అనేది – ఏం చేశాడో చూడండి

That is why Chandrababu is an out-dated politician

చంద్రబాబు ఇంకా ప్రింట్ మీడియా యుగంలోనే ఉన్నారని, ఆయన అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని అందరూ అంటారు. తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో కధ నడిపితే మళ్లీ సీఎం సీటు తనదేనని చంద్రబాబు 2019 ఎన్నికల్లో అతి ధీమాకు పోయారు. కానీ అదే సమయంలో స్మార్ట్ ఫోన్ల యుగాన్ని తలచుకుని మరీ వైసీపీ సోషల్ మీడియాకు జై కొట్టింది. దాంతో బయట మీడియా మద్దతు టీడీపీకి కనిపించినా సోషల్ మీడియా అండదండలతో వైసీపీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా సులువుగా మార్చుకోగలిగింది. దీని వెనక ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు కూడా వున్నాయి. ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

That is why Chandrababu is an out-dated politician
That is why Chandrababu is an out-dated politician

టీడీపీ దెబ్బకి పునరాచనలో పడి చేసిన మిస్టేక్స్ ని సరిదిద్దుకుని సోషల్ మీడియాను గట్టిగా నమ్ముకుంటోంది. ఏపీలో జరుగుతున్న ప్రతీ పరిణామాన్ని గత కొంతకాలంగా టీడీపీ సామాజిక మాధ్యమాలలో పెడుతూ వస్తోంది. దాని ద్వారా జనాల్లో చైతన్యం కలిగించాలని చూస్తోంది. ఏపీలో అభివృద్ధి అన్నది లేదని, అరాచకాలు ప్రబలిపోయాయన్నది టీడీపీ స్లోగన్. దాంతోనే వైసీపీని ఢీ కొట్టాలనుకుంటోంది. ఏపీని టీడీపీ అన్ని రంగాల్లో ముందు వరసలో పెడితే జగన్ మాత్రం అత్యంత వెనకకు తీసుకుపోతున్నాడని కూడా చంద్రబాబు చేస్తున్న ప్రచారం. ఏపీ జనాలకు కావాల్సింది అభివృద్ధి తప్ప పప్పు బెల్లాలు కాదు అని కూడా చంద్రబాబు చెబుతున్నారు.

ఇలా అప్పులు చేసి ఎంతకాలం ఏపీలో జనాలకు పందేరాలు ఇస్తారని కూడా నిలదీస్తున్నారు. తమ హయాంలో పాతిక వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని, వైసీపీ ఎక్కడైనా అంగుళం రోడ్డు వేసిందా అంటూ చంద్రబాబు సంధిస్తున్న ప్రశ్నలు జనాల్లోకి వెళ్ళాలన్నదే ఆ పార్టీ తపన. ఒక విధంగా స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం సిధ్ధపడుతున్నా ఆ పార్టీ 2024 ఎన్నికల అజెండా ఏంటి అన్నది కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు. అంటే 1999 నాటి చంద్రబాబు నినాదం అన్న మాట.

నాడు ఎన్టీయార్ తో పడక వేరుగా మారి టీడీపీని హస్తగతం చేసుకున్న తరువాత చంద్రబాబు ఆయన సంక్షేమ పధకాలకూ నీళ్ళు వదిలారు. పైగా డెవలప్మెంట్ కాన్సెప్ట్ అంటూ తిరిగారు. దాని ఫలితంగా 2004 ఎన్నికల్లో ఓడారు. అపుడు వైఎస్సార్ పఠించిన సంక్షేమ మంత్రం ఇప్పుడు జగన్ ఏలుబడిలో పదింతలు బిగ్గర‌గా వినిపిస్తోంది. చంద్రబాబు కూడా 2014 ఎన్నికల వేళ సంక్షేమమే తనకు శ్రీరామ రక్ష అనుకున్నారు. కానీ జగన్ ఆకాశమే హద్దుగా అన్నట్లుగా అనేక పధకాలు అమలు చేయడంతో ఇక పోటీ పడలేమనుకున్న టీడీపీ పెద్దలు ఇపుడు ఒక్కసారిగా రూట్ మార్చేస్తున్నారు. మరి జగన్ సంక్షేమానికి చంద్రబాబు అభివృద్ధికి మధ్య పోటీలో జనం ఎటు వైపు ఉంటారో చెప్పడానికి జస్ట్ ఒక శాంపిల్ గా స్థానిక ఎన్నికలు ఉంటాయన్న మాట.