ప్రదాని నరేంద్ర మెదీకి మద్దతు ఇవ్వొద్దంటూ ఇస్రో మాజీ చైర్మన్, బిజెపి నేత మాధవన్ నాయర్ కు బెదిరింపుల లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. తమ హెచ్చరికలను కాదని మద్దతిస్తే చంపేస్తామంటూ ఆ లేఖలో మాధవన్ ను హెచ్చరించారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఈ లేఖను పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీని పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా 2003 నుంచి 2009 వరకు ఇస్రో చైర్మన్ గా మాధవన్ నాయర్ వ్యవహరించారు. మాధవన్ నాయర్ కు పలు పురస్కారాలు లభించాయి. గత ఏడాది అక్టోబర్ లో నాయర్ బిజెపిలో చేరారు.