ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ మధ్య కాలంలో చేసిన ప్రయోగాలతో సత్తా చాటగా ఇస్రో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్ ల దిశగా అడుగులు వేస్తుంది. ఇస్రో స్పేస్ రంగంపై దృష్టి పెట్టగా ఇస్రోలో ఉద్యోగాన్ని కెరీర్ గా ఎంచుకున్న వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిది. ఫిబ్రవరి 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది.
మొత్తం 41 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా ఇందులో సైంటిస్ట్ ఉద్యోగాలు 35 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు మెడికల్ ఆఫీసర్, నర్స్, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత ఫీల్డ్‌లో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ కోర్సుల్లో ఏదో ఒకటి పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
లైబ్రరీ సైన్స్ లో ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. www.nrsc.gov.in వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు కాగా దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,80,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉండగా అర్హత, ఆసక్తి ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.