ప్రేమ, మోసం కేసులో తెలంగాణ జడ్జి అరెస్ట్

న్యాయ వ్యవస్థలో మరో భారీ కుదుపు. ప్రజలకు న్యాయాన్యాయాలు చెప్పాల్సిన న్యాయమూర్తి ఒక యువతికి అన్యాయం చేశారన్న ఆరోపణల మీద ఏకంగా అరెస్టు కాబడ్డారు. గత కొంత కాలం కిందట జడ్జీలు నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డి వద్ద లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలు పాలైన తర్వాత మళ్లీ ఇప్పుడు జడ్జి అరెస్టు జరిగింది. ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో జడ్జి అరెస్టు కావడంతో సంచలనం రేపింది. పూర్తి వివరాలు చదవండి. అరెస్టు తాలూకు వీడియో కూడా ఉంది.

దళిత యువతిని ప్రేమ పేరిట మోసం చేసిన కేసులో యాదాద్రి జిల్లా తుంగతుర్తి మేజిస్ట్రేట్ సత్యనారాయణపై హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మెజిస్ట్రేట్ సత్యనారాయణ మీద రేప్, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల క్రితమే ఈ కేసు నమోదైనప్పటికీ పోలీసులు మాత్రం అరెస్టు చేయలేదు. జడ్జి కావడంతో కేసు నమోదైన విషయాన్ని కూడా పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు కానీ మీడియాకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు.

జడ్జి సత్యనారాయణ

అయితే ఈ కేసు విషయంలో హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్న తర్వాత చిక్కడపల్లి పోలీసులు జడ్జి సత్యనారాయణను సోమవారం అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.  జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.

జడ్జి సత్యనారాయణ

ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.