వైసిపి పై పెరుగుతున్న ప్రచారం..పక్కా ప్లాన్ తో టిడిపి

 

ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో వైసిపిపై తెలుగుదేశంపార్టీ  ప్రచారం మోతాదు పెంచుతోంది. కాంగ్రెస్ తో టిడిపి పొత్తు ఎలా పెట్టుకుంటుందని, అది అపవిత్ర కలయిక అని వైసిపి దుమెత్తి పోస్తన్న సంగతి తెలిసిందే. దీనికి తెలుగు దేశం పార్టీ కౌంటర్ మొదలుపెట్టింది. జగన్, పవన్ తిట్టు మానేసి ఇక చేతులు కలుపబోతున్నారనేది ఈ కౌంటర్ ప్రచారం.

 జగన్-పవన్ మధ్య పొత్తుకుదిరిందని, జగన్ జనసేనకు 40 సీట్లు ఆఫర్ చేశారనే ప్రచారాం సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో మొదలైంది. ఇది  టిడిపి చేస్తున్నదని, ఇలాంటి ప్రచారం టిడిపి వ్యూహమని వైసిపి నేతలు అంటున్నారు.  దాంతో రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకించి వైసిపిలో అయోమయ, అలజడి సృష్టించటమే టిడిపి ముఖ్య ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఇఫ్పటికే కొంత వరకూ విజయం సాధించినట్లు కూడా కనబడుతోంది. ఎందుకంటే, టిడిపి చేస్తున్న పొత్తుల విషప్రచారాన్ని ఖండించటానికే వైసిపి సమయం నేతలకు సరిపోతోంది.

 

 

వైసిపిపై టిడిపి ఎందుకు ఈ  ప్రచారానికి తెరలేపింది ? ఎందుకంటే, రాబోయే ఎన్నికలు చంద్రబాబునాయుడుకు అత్యంత ప్రతిష్టాత్మకం. వచ్చే ఎన్నికల్లో గనుక తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాకపోతే జరగబోయే పరిణామాలు, ఎదుర్కోవాల్సిన ఇబ్బందులేమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే తనకున్న మీడియా మద్దతుతో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే    కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు.

 

 

పోయిన ఎన్నికల్లో బిజెపితో అంటకాగింది చంద్రబాబే. అయితే, తన టార్గెట్ రీచ్ అవటం కష్టమని భావించిన మరుక్షణం ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసి వెంటనే బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టిన విషయం చూస్తున్నదే. రాష్ట్ర ప్రజల దృష్టిలో బిజెపిని బూచిగా చూపించి వచ్చే ఎన్నికల్లో తాను లబ్దిపొందాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకే మోడిని, బిజెపిని టార్గెట్ గా పెట్టుకున్నారు. మోదీని బాగా అన్ పాపులర్ చేయడంలో ఆయన కొంతవరకు విజయవంతమయ్యారని చెప్పక తప్పదు.

 

 

పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను బూచిగా చూపించి బిజెపితో కలసి చంద్రబాబు లబ్దిపొందారు. అప్పటి ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్లే అంటూ ప్రచారం  చేశారు. తమకు కాంగ్రెస్ కు సంబంధం లేదని వైసిపి నేతలు మొత్తుకున్నారు. తీరా చూస్తే ఇపుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నది చంద్రబాబే. ఇక మొన్నటి వరకూ జగన్ కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే అని చెప్పేవారు.

కానీ ఇఫుడు జగన్-పవన్ మధ్య పొత్తులు కుదిరిందని జనసేనకు 40 సీట్లు ఇవ్వటానికి జగన్ అంగీకరించారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ప్రచారం మొదలుపెట్టారు. అంటే జగన్, పవన్ వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటారనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. ఒక వేళ అది నిజమే అయినా తప్పేముంది అందులో. అయితే, ఇది తనకు ముప్పు తెచ్చే కలయిక అని ఆయన తెలుసు అందువల్ల,  దీనిని అప్రతిష్ట పాలు చేసి జనం ఈ కూటమి ని ద్వేషించేలా చేయడం చంద్రబాబు వ్యూహమని వైసిపి నేతలు  ఆరోపిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. తనిష్టం వచ్చిన పార్టీలతో పొత్తలు పెట్టుకునే అధికారం చంద్రబాబుకుంది. అందులో తప్పుకూడా ఏమీలేదు. మరి, అదే అధికారం జగన్, పవన్, బిజిపిలకుండదా ? ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా చంద్రబాబుకెందుకు ఉలుకు.  జగన్ ను ఓడించేందుకు పోయిన ఎన్నికల్లో బిజెపి, పవన్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణా ఎన్నికల్లో కెసియార్ ఓటమే ధ్యేయంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీలను కలుస్తున్నారు.

మరి చంద్రబాబును ఓడించేందుకు జగన్, పవన్ కలిస్తే తప్పేమిటి ? కళా మాటల్లో జగన్, పవన్ ఎక్కడ కలుస్తారో అన్న భయమే కనబడుతోంది. వారిద్దరి కలిస్తే తమ పుట్టి ముణుగుతుందన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. జగన్, పవన్ కలుస్తారో లేదో తెలీదు కానీ కలిసినా కలవకపోయిన టిడిపి పుట్టి ముణగటం మాత్రం ఖయమనే అనిపిస్తోంది. చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో .