రామోజీ ఆశయమట.! తెలుగు భాషకి వైభవమట.!

తెలుగుభాషని ఏనాడో ‘ఈనాడీకరించేశారు’ కొందరు.! అంతర్జాలం తదితర పదాల్ని ‘ఈనాడు’ కనుగొందని చెబుతుంటారు.! అసలంటూ ‘ఈనాడు’ పత్రిక పుట్టి వుండకపోతే, తెలుగు భాష ఏమైపోయి వుండేదో.! ‘ఈనాడు’కి ఒకప్పుడు వున్న గుర్తింపు వేరు. ఆ తర్వాత మారిన పరిస్థితులు వేరు.

తెలుగు మీడియా రంగంలో ‘ఈనాడు’ ఆధిపత్యానికి ఏనాడో గండి పడింది.! ఇది బహిరంగ రహస్యం. మీడియా అనేది ఈ రోజుల్లో జస్ట్ వ్యాపారం మాత్రమే.! నేరుగా రాజకీయాల్లో లేకపోయినా, తన మీడియా సంస్థల ద్వారా రాజకీయాల్ని శాసించే ప్రయత్నం రామోజీరావు చేస్తుంటారన్నది బహిరంగ రహస్యం.

ఇప్పుడు ‘ఈనాడు’ మీద విషం చిమ్ముతున్న ‘సాక్షి’ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, గతంలో రామోజీరావు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.! ‘అబ్బే, ఏదో ఫంక్షన్‌లో కలిశారంతే..’ అని వైసీపీ మద్దతుదారులు బుకాయిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

మార్గదర్శి స్కామ్ ఆరోపణల నేపథ్యంలో, రామోజీరావుకి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అండగా నిలుస్తున్నారు.. అదీ సోషల్ మీడియా వేదికగా. ఈ క్రమంలో రామోజీరావుని కీర్తిస్తూ, అర్థం పర్థం లేని ప్రస్తావనలు తెస్తున్నారు.

అందులో ఒకటి, ‘రామోజీరావు ఆశయం.. తెలుగు భాషకి వైభవం’ అని.! ఎంతటి హాస్యాస్పదమైన విషయమిది.? ఇంకా ఇలాంటి ఆణిముత్యాలు చాలానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్. దేనికోసమిదంతా.?

తప్పు జరిగిందన్న అభియోగాలు మోపబడ్డాయ్. తప్పు జరిగిందో లేదో తేలాలి కదా.! రామోజీరావు ఇప్పుడు ఓ కేసులో నిందితుడు. దోషిగా తేలతాడా.? లేదా.? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మీడియా రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నంత మాత్రాన, ఆర్థిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. ఇలా ఎలా సమర్థించగలరు ఎవరైనా.?