ఈ 19 నెలలు గడ్డి పీకావా .. సీఎం జగన్ పై అచ్చెన్న ఫైర్

atchannaidu becomes ap tdp president

గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన 9 గుడుల పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్ భూమిపూజను నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచిన తర్వాత శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ 19 నెలలు గడ్డి పీకావా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేవాలయాలను మళ్లీ నిర్మిస్తామంటే ఆయనను ఎవరైనా కాదంటారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై హిందూ సమాజం మొత్తం ఆగ్రహంగా ఉంది కాబట్టే జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.

jagan is planning to fight for state issues

రాష్ట్రంలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే ఇంత వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదని అచ్చెన్న మండిపడ్డారు. ఈ దాడులన్నీ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగాయని, దేవాలయాలకు జగన్ శంకుస్థాపన చేసినా, ఆయనను ఎవరూ నమ్మరని అన్నారు. హిందువులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. హిందువులకు ఏదో మంచి చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

కనకదుర్గ దేవాలయానికి రూ. 70 కోట్లు ఇస్తామని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెపుతున్నారని… ఈ 19 నెలల్లో దుర్గగుడి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. సీఎం అయిన తర్వాత నాలుగైదు సార్లు ఆలయానికి వెళ్లిన జగన్ కు… అప్పుడు దుర్గామాత గుర్తుకు రాలేదా అని దుయ్యబట్టారు. 150 ఆలయాలు ధ్వంసం అయిన తర్వాత, హిందువులలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్న తరుణంలో… జగన్ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.