చంద్రబబు తర్వాత టీడీపీలో గట్టిగా వినిపించే వాయిస్ ఎవరిదయ్యా అంటే ఔట్ లేకుండా అచ్చెన్నాయుడిదే అనాలి. అసెంబ్లీలో అయినా బయట అయినా ఆయన వైసీపీ మీద విరుచుకుపడేవారు. అందుకే వైసీపీ హిట్ లిస్టులో ఆయనే ముందున్నారు. తరచూ అరెస్ట్ అవుతున్నారు. తాజాగా కూడ ఆయన్ను బెదిరింపుల కేసులో రిమాండ్లో ఉంచారు పోలీసులు. దీంతో టీడీపీ వాయిస్ డౌన్ అవుతుందని అనుకున్నారు అందరూ కానీ అచ్చెన్న లేకపోయినా ఆ స్థాయిలో మాటల యుద్దానికి దిగగలనని నిరూపిస్తున్నారు సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. అధికారంలో ఉన్నప్పుడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెమ్మదిగానే ఉన్న ఈయన ఇప్పుడు మాత్రం సీరియస్ అయిపోయారు. ఎప్పుడూ మితంగా మాట్లాడేవారు కాస్త మాటల్తో విరుచుకుపడుతున్నారు.
తాజాగా టీడీపీ నేత పట్టాభి మీద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిని స్వీయ దాడిగా అభివర్ణించారు వైసీపీ నేతలు. కొడాలి నాని లాంటి వారు ఇదంతా టీడీపీ పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుని తమ మీద నిందలు వేస్తోందని మాట్లాడారు. దీంతో మాజీ మంత్రి అయ్యన్న అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. వైఎస్ జగన్ నుండి మొదలుపెట్టి వైఎస్ఆర్, వైఎస్ రాజారెడ్డిల వరకు మాటల తూటాలు పేల్చారు. పట్టాభి తన మీద తానే దాడి చేసుకున్నారని బులుగు గొర్రెలు మొరుగుతున్నాయి. ముఖ్యంగా గుడివాడ గొర్రె, గన్నవరం గొర్రెల డాక్టర్. మరి కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్, బలపనూరులో బడి గంటలు కొడుతూ, బ్రీటీష్ వాళ్ళకు పంది మాంసం సప్లై చేసిన రాజా రెడ్డి, తన మీద తానే బాంబు వేసుకుని పోయాడా అన్నారు.
పావురాలగుట్టలో పావురం అయినోడు, తన హెలికాప్టర్ తానే పేల్చుకున్నాడా ? వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, కోడికత్తితో గుచ్చుకుని “అమ్మా అంటూ బిగ్గరగా కేక వేసిన జగన్” అని ఆడిన డ్రామాల సంగతి ? అధికారంలో ఉండి కూడా, ఆధారాలు లేకుండా, ఇలా గాలి ఏడుపులు ఏడుస్తారు కాబట్టే, మిమ్మల్ని గాలి మంద, ఫేక్ మంద అనేది అంటూ విపరీత ధోరణిలో విమర్శలు గుప్పించారు. హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్లలో తిరగటానికి,16 నెలల్లో, రూ.26 కోట్లా? అదీ ప్రజా ధనం? పోనీ పీకింది ఏమైనా ఉందా అంటే,చీకట్లో ఢిల్లీ వెళ్ళటం,జైలుకి పోకుండా వేడుకోలు, జడ్జీల మీద ఫిర్యాదులు,కోర్టు ముందు హాజరు,పెళ్ళిళ్ళు,పేరంటాలు.. ప్రజల కోసం ఈ రూ.26 కోట్లతో మీరు పీకింది ఏంటి జగన్ అంటూ సీఎం మీద ప్రత్యేకమైన ట్వీట్ సంధించారు. ఎన్నడూ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లని అయ్యన్న ఇలా మాట్లాడటం చూస్తే ఇకపై వైసీపీ విషయంలో ఆయన తీరు ఇలానే ఉండబోతుందని అనిపిస్తోంది.