పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్.! వణికి ఛస్తోన్న టీడీపీ అను‘కుల’ మీడియా.!

తెలుగుదేశం పార్టీ అను‘కుల’ మీడియా వణికి ఛస్తోంది.. అదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళడంపై. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం కోసం ఢిల్లీకి వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దల్ని కలిసేందుకు అపాయింట్‌మెంట్లు దొరుకుతున్నాయి.

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జనసేన అధినేత. తనను జనసేన అధినేత కలవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ట్వీటేశారు కూడా.! జనసేన – బీజేపీ మధ్య నిన్న మొన్నటిదాకా వున్న కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది.

2024 ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసి పోటీ చేయడంతో స్పష్టత ఇంకాస్త పెరిగింది. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.? వంటి అంశాలు ఇప్పుడే చర్చకు రావుగానీ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి బీజేపీ అధినాయకత్వం జనసేనానిని ఆరా తీయడమైతే జరుగుతోంది.

టీడీపీతో కలిసి వెళ్ళడం ఎంతవరకు లాభం.? అన్నదానిపై బీజేపీ కొంత తటపటాయిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రస్తావనను చాలా తక్కువగా తీసుకొస్తున్నారు జనసేనాని. దాంతో, టీడీపీ అలాగే టీడీపీ అను‘కుల’ మీడియా ఉలిక్కి పడుతున్నాయి. టీడీపీతో కనుక బీజేపీ కలవపోతే, బీజేపీని వదిలించుకుని, టీడీపీతో జనసేనాని నడుస్తారంటూ టీడీపీ అను‘కుల’ మీడియా ప్రచారం చేస్తోంది.

ఏపీలో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తమతో కలిసి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనసేనాని. అంటే, బీజేపీ – జనసేన కూటమి.. అందులోకి టీడీపీ రావడం, రాకపోవడం.. అన్నది టీడీపీ సొంత నిర్ణయమన్నది జనసేనాని ఉవాచ.!