తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా బతుకమ్మ చీరల పంపిణి చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే తాజాగా ఆ చీరలను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు డిసిఎం లో 170 బేళ్ల కేసీఆర్ చీరలను తరలిస్తుండగా కూసుమంచి వద్ద టిడిపి నేతలు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. బతుకమ్మ పండుగకు పంచాలనుకున్న చీరలను ఎన్నికల వేళ పంచాడానికి టిఆర్ ఎస్ నాయకులు ఈ విధంగా చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
వాహనాన్ని పట్టుకోని అధికారులకు అప్పగించారు. కేసీఆర్ చీరలని నీవు కొత్తగూడెం వెళ్లాక ఫోన్ చేస్తే మనిషి వచ్చి వాహనాన్ని తీసుకెళతాడని చెప్పారని డ్రైవర్ చెప్పారు. డ్రైవర్ చెప్పిన వీడియో కింద ఉంది చూడండి.