ఇప్పుడు కాదు కానీ.. ఒకప్పుడు అనంతపురం జిల్లా మొత్తం పరిటాల ఫ్యామిలీ అంటేనే ఉలిక్కిపడేది. దానికి కారణం పరిటాల రవి. ఆయన పోయాక.. పరిటాల ఫ్యామిలీకి కష్టాలు మొదలయ్యాయి.
అయినప్పటికీ పరిటాల ఫ్యామిలీకి టీడీపీ పార్టీ అండగా నిలిచింది. అనంతపురం రాజకీయాలను వాళ్లకే అప్పజెప్పింది. కానీ.. పరిటాల రవి ఉన్నప్పుడు ఉన్న ఆ క్రేజ్ ఇప్పుడు ఆ ఫ్యామిలీకి లేదు. దీంతో పరిటాల ఫ్యామిలీ రాజకీయ జీవితం కూడా రోజురోజుకూ కనుమరుగైపోతోంది.
2019 ఎన్నికల్లో పరిటాల రవి వారసుడిగా పరిటాల శ్రీరామ్ తెర మీదికి వచ్చాడు. రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీరామ్ శ్రీకారం చుడతాడని అంతా అనుకున్నారు. కానీ.. 2019 ఎన్నికల్లో శ్రీరామ్ దారుణంగా ఓడిపోయాడు. దీంతో అప్పటి నుంచి శ్రీరామ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి అసలు పెనుగొండలోనే కాదు అనంతపురంలోనే పరిటాల కనిపించడం లేదంట. పరిటాల ఫ్యామిలీ అంటేనే ధైర్యానికి పెట్టింది పేరు. కానీ.. శ్రీరామ్ మాత్రం చాలా భయస్తుడు అని అనంతపురం వాసులు చెబుతుంటారు.
గతంలో ఓసారి పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అయితే.. ఎక్కడ దొరికిపోతానో అని… బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో తలదాచుకున్నాడట. కనీసం తమ క్యాడర్ కు కూడా చెప్పకుండా పారిపోయాడని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది.
ఇంత భయస్తుడు.. పరిటాల వారసత్వానికి పనికిరాడు. తన తండ్రికి ఉన్న ధైర్యంలో పైసావంతు కూడా శ్రీరామ్ కు రాలేదని పరిటాల అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక.. ఇప్పుడేమో.. అసలు అనంతపురం వైపు కూడా చూడకుండా ఎక్కడో తలదాచుకున్నాడట. అజ్ఞాతంలో ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడో కూడా ఎవ్వరికీ తెలియదట. ఇంతలా భయపడుతూ బతకడం వల్ల ఏంటి ఉపయోగం.. కనీసం పుట్టిన ఊరుకు కూడా రాకుండా ఎక్కుడో దాక్కొని బతకడం ఎందుకు అంటూ అనంతపురం జిల్లా వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.