పరిటాల ఫ్యామిలీతో ఇరుకునపడిన చంద్రబాబు!

ప్రస్తుతం చంద్రబాబుకు ఒక కొత్త సమస్య ఎదురైంది. పార్టీలో ఇప్పటికే పాతుకుపోయిన సీనియర్లు.. బాబుని ఇరకాటంలో పాడేస్తున్నారంట. తమ మాట వినాల్సిందేనని పట్టు పడుతున్నారంట. దీంతో.. వారిని కాదన లేక, ఉన్నవారికి అవుననలేక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారనే ఒక చర్చ పార్టీలో నడుస్తుంది. అదేమిటంటే… వారసులకు కూడా సీట్ల పంచాయతీ!

తమ తరుపున తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వమని అడగడంలో ఒక అర్ధముంది. కానీ… కొంతమంది సీనియర్లు మాత్రం తమతో పాటు తమ వారసులకు కూడా టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారంట. ఈ విషయంలో… నర్సీపట్నం ఎమ్మెల్యేగా తనకు టికెట్ ఇవ్వటమే కాకుండా.. విశాఖపట్నం ఎంపీగా కొడుకు విజయ్‌ కు టికెట్ ఇవ్వాల్సిందే అని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గట్టిగా పట్టుబట్టుతున్నారంట. పార్టీలో తన కుమారుడు కూడా యాక్టివ్ గా ఉంటున్నాడనేది ఆయన లాజిక్ అంట!

ఇదే క్రమంలో.. తునిలో త‌న కుమార్తె దివ్యకు కూడా టికెట్ ఇవ్వాల్సిందే అని ఆ పార్టీ సీనియర్ నేత, చంద్రబాబుకు బాగా సన్నిహితుడైన యనమల రామకృష్ణుడు గట్టిగా చెబుతున్నారట. ఇక ఈ లిస్ట్ లో ఎప్పటినుంచో ఉన్న జేసీ బ్రదర్స్ కూడా బాబుకు రిక్వస్ట్ లు పంపుతున్నారని సమాచారం. తమ వారసులు జేసీ వపన్, జేసీ అస్మిత్‌ లకు టికెట్లు ఇవ్వాల్సిందే అని గట్టిగా చెబుతున్నారట. ఇక గంటా శ్రీనివాసరావు కూడా కొడుకు గంటా రవితేజకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. వారితోపాటు ఎచ్చెర్లలో తనతో పాటు మరోచోట తన కొడుకు రాం మల్లిక్‌ కు టికెట్ ఇవ్వాలని కిమిడి కళా వెంకట్రావు పదేపదే అడుగుతున్నారట.

ఇలా టీడీపీలోని సీనియర్స్ అంతా బాబువద్ద ఫ్యామిలీ ప్యాకేజ్ టాపిక్స్ తీసుకొస్తున్నారట. అయితే అస్సలు కుదరదని బాబు చెప్పే ప్రయత్నం చేయగా… పరిటాల ఫ్యామిలీ టాపిక్ తెస్తున్నారంట సీనియర్లు. కారణం… తాజాగా తన పాదయాత్రలో భాగంగా… రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌ కు టికెట్లు ప్రకటించారు లోకేష్. దీంతో… ఆ అంశాన్ని చూపిస్తూ… పరిటాల కుటుంబానికి ఒక న్యాయం.. తమకు ఒక న్యాయమా? అంటూ సీనియర్లు అలుగుతున్నారని తెలుస్తుంది.

మరి వీలైనంత తొందరగా చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి పరిష్కరిస్తారా? లేక, ఆ అలకలు ఆగ్రహాలుగా మారేవరకూ ముదరబెట్టుకుంటారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా… పరిటాల ఫ్యామిలీ విషయంలో చినబాబు తీసుకున్న నిర్ణయం వల్ల… బాబుకు ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ల సమస్య ఈస్థాయిలో వచ్చి పడిందని అంటున్నారు తమ్ముళ్లు!