టీడీపీ జనసేన.. జగన్ కంటే గొప్పగా పాలించడం ఈ పార్టీలకు సాధ్యమా?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నా ఎల్లో మీడియాలో, సోషల్ మీడియాలో జగన్ పాలన గురించి నెగిటివ్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. జగన్ సర్కార్ పై కొంతమేర వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకత టీడీపీ పాలన స్థాయి వ్యతిరేకత అయితే కాదు. జనసేన అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపము అని పవన్ చెబుతున్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే పవన్ అధికారంలోకి వచ్చినా ఇవే సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాలి. పవన్ కామెంట్లు విన్న నెటిజన్లు జనసేనకు సొంతంగా మేనిఫెస్టో ప్రకటించే సామర్థ్యం కూడా లేదా అంటూ కామెంట్లు చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. జగన్ పథకాలు పవన్ కు నచ్చుతున్నాయని జగన్ మాత్రం నచ్చడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

పవన్ అధికార కాంక్షతో మాత్రమే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడినా జనసేన అధికారంలోకి రావడం ఎప్పటికీ జరగదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తాను దెబ్బ తిన్న పులినని పవన్ ప్రచారం చేసుకుంటుండగా రాబోయే రోజుల్లో ఆయనకు మరో దెబ్బ తగలడం ఖాయమని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైసీపీ పాలన బాగుందని పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెప్పేశారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కామెంట్ల గురించి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జనసేన పార్టీ ద్వారా జనాలకు మాత్రం ఎలాంటి బెనిఫిట్ కలగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.