చిన్న జర్నలిస్టులపై పన్నులు.. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రైటేనా?

Jagan_Mohan_Reddy_1643170257471_1643170257702

ఏ ప్రభుత్వమైనా తొమ్మిది మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని గురించి ఇతరులు విమర్శలు చేయడం సాధారణంగా జరుగుతుంది. సీఎం జగన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. వైఎస్సార్ లా అందరివాడు అనిపించుకునే విషయంలో జగన్ మాత్రం ఫెయిలవుతున్నారు. జగన్ కు సలహాలు ఇస్తున్నారో లేక అధికారులు పొరపాట్లు చేస్తున్నారో తెలీదు కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి.

తాజాగా జగన్ సర్కార్ చిన్న జర్నలిస్టులపై పన్నులు విధించాలని తీసుకున్న నిర్ణయం గురించి జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా జగన్ సర్కార్ మండల స్థాయి కంట్రిబ్యూటర్లకు పన్ను విధించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జర్నలిస్టులు వృత్తి పన్ను కట్టడం లేదని గత ఐదేళ్ల పన్నును ఇప్పుడు కట్టాలని ప్రభుత్వం కోరుతుండటం గమనార్హం. ప్రభుత్వం వృత్తి పన్నును డిమాండ్ చేయడంతో షాకవ్వడం జర్నలిస్టుల వంతవుతోంది.

తక్కువ ఆదాయం వచ్చే తమపై జగన్ సర్కార్ కక్ష కట్టడం న్యాయం కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ సర్కార్ ఈ విధంగా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని కొంతమంది జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ ఆదాయం పెరగడం లేదని వాళ్లు వెల్లడిస్తున్నారు.

ప్రభుత్వం తమ విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ ఆదాయం పెరగడం లేదని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. తప్పుడు నిర్ణయాలతో జగన్ సర్కార్ కెరీర్ పరంగా పొరపాట్లు చేస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.