వైసీపీ చేస్తే అన్యాయం టీడీపీ చేస్తే న్యాయం.. ఆ రాతలు మారవా?

YCP Vs TDP

ఏపీ సీఎం వైఎస్ జగన్ పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా ఆ నిర్ణయాలు ఎల్లో మీడియా అధినేతలకు నచ్చడం లేదు. కొన్నిరోజుల క్రితం జగన్ సర్కార్ ట్యాబ్ లను పంపిణీ చేయగా అమ్మఒడి డబ్బులు ట్యాబ్ లు తీసుకున్న వాళ్లకు రావంటూ ఎల్లో మీడియా పత్రికలు విష ప్రచారం చేయడం జరిగింది. జగన్ కు వ్యతిరేకంగా ఎల్లో మీడియా పత్రికల్లో పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

టీడీపీ చేసిన ప్రతి పని న్యాయమని వైసీపీ సర్కార్ ఏం చేసినా అన్యాయమని కథనాలు ప్రచారంలోకి వస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇకనైనా ఈ రాతలు మారవా అంటూ సామాన్య ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ను ఇంతలా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

రెండు నాల్కల ధోరణి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో కూడా వైసీపీకి నష్టం చేకూరేలా ఎల్లో మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎల్లో మీడియా రాతలే తెలుగుదేశంకు శాపం అంటూ కొంతమంది నుంచి కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ రెండు పత్రికలు టీడీపీ కరపత్రికలలా ఉన్నాయని సామాన్యులు సైతం చెబుతున్నారు.

ఏపీలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అమలవుతున్నా పచ్చ పార్టీలు మాత్రం అస్సలు మారడం లేదు. పచ్చ పార్టీల కథనాలు ఫేక్ వార్తలు అని తెలుగు తమ్ముళ్లకు సైతం అర్థమవుతోంది. టీడీపీకి ఈ రెండు పత్రికలు చేసిన అతి ప్రచారం వల్ల కలిగిన నష్టం అంతాఇంతా కాదు. పొరపాట్లను రిపీట్ చేస్తే రాబోయే రోజుల్లో కూడా టీడీపీకి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు