ఏంటి బాలయ్యా.! పవన్ కళ్యాణ్‌కి అన్‌స్టాపబుల్ భజనేల.?

‘అలగాజనం’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులపైనా, జనసేన కార్యకర్తలపైనా కొన్నాళ్ళ క్రితం సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తీవ్రంగా బాధించాయి. ఆ గాయానికి ‘పూత’ వేసినట్లుంది అన్‌స్టాపబుల్ టాక్ షో.!

అన్‌స్టాపబుల్ టాక్ సో మొదలైనప్పటినుంచి.. ఎపిసోడ్ ముగిసేవరకు.. ఒకటే భజన.! నందమూరి బాలకృష్ణని ఇలా ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూసి వుండరు. ‘పవన్ కళ్యాణ్ మూడు పెళిళ్ళపై ఎవరైనా కామెంట్లు వేస్తే.. వారు ఊర కుక్కలు కిందే లెక్క..’ అనేశారు నందమూరి బాలకృష్ణ. అసలు అలా అనాల్సిన అవసరమేముంది.? రాజకీయాలన్నాక విమర్శలుంటాయ్.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘దొంగ’ అని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ విమర్శిస్తే తప్పు కాదా.? మరి, వాళ్ళని ఏ జంతువులతో పోల్చాలి.?

అన్‌స్టాపబుల్ టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్నది ‘ఆహా’ వేదికపై. అది అల్లు అరవింద్ భాగస్వామ్యంలో వున్నది. సో, మేటర్ క్లియర్.! బాలయ్యతో, పవన్ కళ్యాణ్ భజన చేయించేందుకే ఈ టాక్ షో అన్నట్లు తయారైంది.

ఒకరకంగా ఈ ఎపిసోడ్ జనసేన పార్టీకి మేలు చేసింది. కాస్తో కూస్తో తెలుగుదేశం పార్టీకి కూడా మేలు చేయొచ్చు. ఎందుకంటే, రెండు పార్టీలూ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముంది కదా.?

పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఇప్పుడు వైసీపీ ఎంత దారుణంగా మాట్లాడుతోందో.. అంతకంటే దారుణంగా గతంలో టీడీపీ నేతలూ మాట్లాడారు. మరి, ‘ఊరకుక్కలు’ అనే మాట, టీడీపీ నేతలకూ వర్తిస్తుందని బాలయ్య వార్నింగ్ ఇచ్చారనుకోవాలా.?