వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో జైలు నుంచి విడుదలైలన సుధాకర్ రెడ్డి అన్నారు. వివేకానందరెడ్డి ఇల్లు ఎక్కడుందన్న విషయం కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పుడు 9 ఎకరాల్లో అరటిపంట వేసుకుని సాగు చేసుకుంటున్నానన్నారు. అసలు రాజారెడ్డి హత్య కేసుకు కూడా తనకు సంబంధం లేదని అన్యాయంగా తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను జైలులో 12 సంవత్సరాలు నరకయాతన అనుభవించానని, గతేడాది జూన్ 20న తాను జైలు నుంచి విడుదలయ్యానన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానన్నారు.
తన పేరు టీవీలో రావడంతో తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చానన్నారు. అయితే ఎస్సై లేకపోవడంతో కానిస్టేబుల్ తో మాట్లాడి వచ్చానన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంలో తన పాత్ర ఉన్నట్లు తేలితే ఉరితీయాలని స్పష్టం చేశారు.