ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీంతో.. రేపటి నుంచి బడ్జెట్ పై అసెంబ్లీ వేదికగా వాడీ వేడీ చర్చ ఉంటుంది! ఇలా ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే… ఉన్నపలంగా ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం జగన్! దీంతో… ఇంత టైట్ షెడ్యూల్ లో సడన్ గా జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారబ్బా? అంటూ సెటైర్లు మొదలుపెట్టేసింది టీడీపీ!
ఈరోజు (మార్చి 16) సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం. అవును… అసెంబ్లీ అయిన అనంతరం జగన్ హస్తిన ప్రయాణం ఉంటుందట. అందులో భాగంగా.. రాత్రి 7.15 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారట. ఈ రాత్రికి 1 జన్ పథ్ నివాసంలో సీఎం బస చేస్తారట. రేపు (మార్చి 17) న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లతో ఏపీ సీఎం జగన్ కు అపాయింట్ మెంట్ ఉందని తెలుస్తోంది. వారిద్దరినీ ఆయన విడివిడిగా కలవబోతున్నారంట.
అయితే… ఉన్నపలంగా జగన్ హస్తినకు వెళ్లడం వెనకున్న రాజకీయ కారణాల సంగతి కాసేపు పక్కనపెడితే… పెండింగ్ బకాయిలపై వినతిపత్రాలు ఇవ్వడం అనేది ఇప్పుడు అతిముఖ్యమైన పని అని.. అందుకే జగన్ ఉన్నపలంగా ఢిల్లీకి వెళ్లనున్నారని అంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా… విశాఖ నుంచి పాలన అనే అంశాంబ్ని మోడీకి వివరిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఆ అంశం కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా సడన్ గా సీఎం ఢిల్లీ టూర్ ప్రోగ్రామ్ ఫిక్స్ కావడం మాత్రం ఏపీ రాజకీయా వర్గాల్లో చర్చకు తావిచ్చింది.
అయితే… ఈ సడన్ టూర్ పై టీడీపీ అప్పుడే కౌటర్లు స్టార్ట్ చేసేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నేతలపై సీబీఐ విచారణ ఫైనల్ కి వచ్చిందని.. ఈ కేసుకు సంబందించి రిక్వస్ట్ కోసమే వెళ్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో… వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకుని ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన విషయంపై కూడా వెళ్తున్నారని టీడీపీ నేతలు కామెంట్లు పెడుతున్నారు!
దీంతో… ముసుగేసుకుని చీకట్లో చిదంబరాన్ని కలిసిన చరిత్ర మీదని, జగన్ కు ఆ అవసరం లేదని రీ కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ జనాలు!