ఏపీ హైకోర్టే ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా.. జనసేన, టీడీపీలకు దిమ్మతిరిగే షాక్!

ap high court serious on ap police

మూడు రాజధానుల విషయంలో ప్రజలంతా ఒకవైపు ఉంటే టీడీపీ, జనసేన మరోవైపు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అమరావతి రైతులతో పిటిషన్లు వేయించి మూడు రాజధానుల దిశగా అడుగులు పడకుండా టీడీపీ చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావు. అయితే జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు చేసిన కామెంట్లు టీడీపీ, జనసేనలకు భారీ షాక్ అని చెప్పవచ్చు.

ఏపీ హైకోర్టే ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా అంటూ సుప్రీం కోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు తప్పుబట్టడంతో పాటు హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరగడం కరెక్ట్ కాదని హైకోర్టు వెల్లడించింది. ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు మండిపడింది.

రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధికి సంబంధించి గడువు విధించడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొంది. దేశంలోని చాలా ప్రాంతాలలో రాజధాని ఒక ప్రాంతంలో హైకోర్టు మరో ప్రాంతంలో ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తిస్థాయిలో విచారణ చేసి రాజధానిపై తుది తీర్పును ఇస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. వైసీపీకి అనుకూలంగా సుప్రీం కోర్టు కామెంట్లు ఉండటం గమనార్హం.

తప్పటడుగులు వేస్తే మాత్రం నష్టపోయేది టీడీపీ, జనసేన అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన మూడు రాజధానులకు మద్దతు ఇవ్వని పక్షంలో ఆ పార్టీలకు భవిష్యత్తు ఉండదని మరి కొందరు చెబుతున్నారు. మూడు రాజధానులకు సంబంధించి చోటు చేసుకుంటున్న మలుపులు చర్చనీయాంశం అవుతున్నాయి.