ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి విమర్శలు చేసే అవకాశం వస్తే విమర్శించే విషయంలో ఇతర పార్టీల నేతలు ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ కోసం పని చేసిన నేతలు సైతం ప్రస్తుతం జగన్ పై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. జగన్ పై ప్రతిపక్ష నేతలు సైతం అవినీతి ఆరోపణలు చేయలేదు. ఏపీలో అవినీతి జరిగినట్టు ఆధారాలు కూడా లేవనే సంగతి తెలిసిందే.
అయితే డీఎల్ రవీంద్రా రెడ్డి మాత్రం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చినా గొప్పేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని కాపాడగల సత్తా ఉన్న నేత అని డీఎల్ కామెంట్లు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని డీఎల్ రవీంద్రా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీ కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేయాలని ఆయన కామెంట్లు చేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నానని వచ్చే ఎన్నికల్లో గుర్తింపు ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తానని డీఎల్ రవీంద్రా రెడ్డి తెలిపారు. అయితే జగన్ సపోర్ట్ లేకుండా గెలిచే దమ్ము, ధైర్యం డీఎల్ రవీంద్రా రెడ్డికి ఉందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సింగిల్ డిజిట్ వైసీపీకి రాని పక్షంలో టీడీపీ, జనసేన కలిసి ఎందుకు పోటీ చేయాలని కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
తొలిరోజు నుంచి జగన్ అవినీతి చేస్తున్నాడని వైసీపీలో ఉన్నానని చెప్పాలంటే అసహ్యం వేస్తోందని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. అయితే 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు సైతం ఇవే తరహా కామెంట్లు చేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో డీఎల్ రవీంద్ర రెడ్డి పరిస్థితి కూడా ఇంతేనేమో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.