ఆ కామెంట్లపై విజయసాయిరెడ్డి స్పందిస్తారా.. ఆ ఆస్తులు ఎవరివో చెబుతారా?

Vijayasai Reddy'

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో తన ఆస్తుల గురించి గతంలో మాట్లాడుతూ విశాఖలో ఒక ఫ్లాట్ మినహా తనకు, తన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ పత్రికలో విజయసాయిరెడ్డి కూతురు, అల్లుడు పేర్లపై ఉన్న ఆస్తుల గురించి కథనం రావడంతో ఈ ఆస్తుల గురించి జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

విజయసాయిరెడ్డి కూతురు, అల్లుడు పేర్లపై ఉన్న ఆ భూముల విలువ ప్రభుత్వ రికార్డుల ఏకంగా 53 కోట్ల రూపాయలు కాగా మార్కెట్ విలువ అంతకంటే ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ కామెంట్ల గురించి, కథనాల గురించి విజయసాయిరెడ్డి స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. వైసీపీ ఎంపీ గురించి ఈ తరహా కథనాలు ప్రచారంలోకి రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.

వైసీపీ ప్రభుత్వం విశాఖ నుంచే పాలన సాగించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ తరహా ఆరోపణలు ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదు. వైసీపీ సర్కార్, వైసీపీ నేతలు అవినీతికి దూరంగా ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విజయసాయిరెడ్డి అల్లుడు, కూతురుకు చెందిన భూములు అవ్యాన్ రియల్టర్స్ ఎల్.ఎల్.పీని 2020 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ విశాఖతో పాటు విశాఖ పరిసర ప్రాంతాలలో భూములను కొనుగోలు చేయడం గమనార్హం. ఈ సంస్థ తరపున భూములకు సంబంధించి రిజిస్టేషన్లు కూడా జరిగాయి. విజయసాయిరెడ్డి వివరణ ఇవ్వని పక్షంలో ప్రజలు ఈ ఆరోపణలు నిజమేనని నమ్మే అవకాశం ఉంటుంది.