ఏపీ టీచర్లకు షాక్.. నిమిషం ఆలస్యంగా వస్తే ప్రభుత్వం అలా చేస్తోందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విలీనం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు విద్యార్థుల తల్లీదండ్రులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ పాఠశాలలలో పని చేసే టీచర్ల విషయంలో సైతం ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

టీచర్లు రెండు నిమిషాలు స్కూల్ కు ఆలస్యంగా వస్తే ఏపీ సర్కార్ నోటీసులు ఇస్తుండటం గమనార్హం. 10 నిమిషాలు లేదా అంతకంటే ఆలస్యంగా వస్తున్న టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఉదయం 10.30 గంటల లోపు హాజరు పూర్తి చేసి హాజరును ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచనలు చేసింది.

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా హాజరును ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉండటంతో మారుమూల గ్రామాలలో పని చేసే ఉపాధ్యాయులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. హాజరు పూర్తి చేయడం, ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం వల్ల అరగంట సమయం వృథా అవుతోందని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి విద్యార్థుల పనితీరు మెరుగుపడని పక్షంలో ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నారు.

ఏపీ సర్కార్ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు ఒకే తరహాలో ఐక్యూ ఉండదని విద్యార్థులు పరీక్షలలో మెరుగైన ఫలితాలను సాధించకపోతే ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయులపై యాప్ ల ఒత్తిడి తగ్గిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేసుకుంటూ పోతే విద్యా వ్యవస్థ నాశనమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి