షర్మిలకు జగన్ సపోర్ట్ ఉందా.. ఆ పత్రికలో ప్రాధాన్యత పెరిగిందిగా?

YS Sharmila to float new political party in Telangana 

ప్రముఖ దినపత్రికలలో ఒకటైన సాక్షిలో గతంలో షర్మిలకు ఎక్కువగా ప్రాధాన్యత దక్కేది కాదు. షర్మిల కొత్త పార్టీని ప్రకటించిన సమయంలో కూడా సాక్షి పత్రిక షర్మిలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే క్రమంగా సాక్షి పత్రికలో షర్మిలకు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. షర్మిలకు జగన్ సపోర్ట్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల కామెంట్లకు సాక్షి కవరేజీ అంతకంతకూ పెంచుతుండటం గమనార్హం.

ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ పాలన విషయంలో ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్ బిడ్డగా గుర్తింపును సంపాదించుకున్న షర్మిల రాబోయే రోజుల్లో తెలంగాణలో కచ్చితంగా సక్సెస్ సాధిస్తాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. వైఎస్సార్టీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె బలంగా నమ్ముతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు తన పార్టీ ప్రత్యామ్నాయం అవుతుందని షర్మిల భావిస్తున్నట్టు బోగట్టా.

జగన్ నుంచి కూడా సపోర్ట్ లభిస్తే అనుకున్నది సాధించడం కష్టం కాదనే భావనను ఆమె కలిగి ఉన్నారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఉన్న షర్మిల ప్రజల్లో అభిమానాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందడుగులు వేస్తున్న షర్మిల పొలిటికల్ గా సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.

రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో షర్మిల సత్తా చాటడం కష్టం కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలకు షర్మిల ప్రాధాన్యత ఇస్తుండటం కూడా ఆమెకు పొలిటికల్ గా ప్లస్ అవుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు రావడం పక్కా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.