ఏపీలో జగన్ అధికారంలోకి రావడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు. జగన్ రేయింబవళ్లు కష్టపడటంతో పాటు ప్రజలకు దగ్గరై ప్రజల మెప్పు పొందడంతో ప్రస్తుతం జగన్ ఏపీకి సీఎంగా ఉన్నారు. అయితే షర్మిల రాజకీయాల వల్ల జగన్ కు నష్టం జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల పొలిటికల్ గా పార్టీ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ కు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుండటం గమనార్హం.
గత ఎన్నికల సమయంలో జగన్ కు కేసీఆర్ సహాయం చేశారని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. జగన్, కేసీఆర్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. షర్మిల రాజకీయాల వల్ల జగన్ కేసీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. చెల్లి రాజకీయాలు జగన్ కు ఊహించని రేంజ్ లో మైనస్ అవుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
షర్మిల ఏపీలోనే వైసీపీలో కొనసాగి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తానని ప్రకటించినా జగన్ మద్దతు కూడా కచ్చితంగా ఉండేదనే సంగతి తెలిసిందే. అలా కాకుండా తెలంగాణపై షర్మిల దృష్టి పెట్టడంతో సహాయం చేసే అవకాశం ఉన్నప్పటికీ జగన్ సహాయం చెయ్యలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రాబోయే రోజుల్లో జగన్ షర్మిలకు సహాయం అందిస్తారో లేక మొండిచెయ్యి చూపుతారో చూడాల్సి ఉంది. తెరాస రివర్స్ అయితే మాత్రం వైసీపీకి షాక్ తగులుతుందని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాల వల్ల వైసీపీకి భారీ స్థాయిలో నష్టం కలుగుతోందని చెప్పవచ్చు.