టీకా తీసుకున్న 24 గంటల్లోపే పారిశుద్ధ్య కార్మికుడి మృతి .. !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి మరణించాడు. వ్యాక్సిన్ వికటించడం వల్లే అతడు మరణించాడనీ, గతంలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని మృతుడి బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశ వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా టీకాను అందిస్తున్న విషయం తెలిసిందే.

china released corona vaccine last month

ఈ నేపథ్యంలోనే ఏపీలో ఇప్పటికే వైద్య సిబ్బందికి, శానిటరీ సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇటీవలే పోలీసులకు కూడా కరోనా వ్యాక్సినేషన్ ను ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా తిరుపతిలోని మల్లంగుంట పంచాయతీ, రామానుజ పల్లి అంబేద్కర్ కాలనీకి చెందిన శానిటరీ వర్కర్ కృష్ణయ్యకు కరోనా వ్యాక్సిన్ ను మంగళవారం ఇచ్చారు.అయితే వ్యాక్సిన్ ను తీసుకున్న కొద్ది సేపటి తర్వాత కృష్ణయ్య నీరసించి పడిపోయాడు . దీంతో వెంటనే వైద్యులు అతడికి చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. చికిత్స పొందుతూనే బుధవారం కృష్ణయ్య మరణించాడు.

వ్యాక్సిన్ వేసిన 24గంటల్లోపే కృష్ణయ్య మరణించాడనీ, వ్యాక్సిన్ వికటించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో కృష్ణయ్యకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవనీ, వ్యాక్సిన్ వల్లే మరణించాడని చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై అధికారులు విచారణ మొదలు పెట్టారు. అతడికి గతంలో ఏమైనా అనారోగ్య లక్షణాలు ఉన్నాయా..? అసలేం జరిగింది.? అన్నది ఆరా తీస్తున్నారు. వ్యాక్సిన్ వల్లే మరణించాడని చెప్పలేమన్నారు. అతడి హెల్త్ హిస్టరీని అధికారులు తీస్తున్నారన్నారు.