ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇసుక లారీ దందాలో జోక్యం చేసుకుని, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని లారీ యజమానులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక తరలించే లారీలపై టన్నుకు ₹250 చొప్పున టాక్స్ చెల్లించాలని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు.
తాజాగా, లారీ ఓనర్‌కు చెందిన ఇసుక లారీని అడ్డుకున్న, అక్రమ టాక్స్ చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వసూళ్లను ప్రశ్నించగా, బెదిరింపులకు పాల్పడి, ఆ లారీని బలవంతంగా పోలీస్ స్టేషన్‌లో పెట్టించినట్టు లారీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామండూరు అటవీ పరిశీలన, ఎర్రచందనం గొడౌన్ల తనిఖీ!
Panchumarthi Anuradha: “ఇంకా బుద్ధి రాలేదా”: జగన్ పై అనురాధ ఫైర్ – పేటీఎం బ్యాచ్‌కు గట్టి హెచ్చరిక!
“ఇక్కడ కరెన్సీకి అలవాటు పడి పేద ప్రజలను ఇబ్బంది పెడితే మా పరిస్థితి ఏంది? మేము ఎవరికి చెప్పుకోవలెను? రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు పేదలకు అవకాశాలు కల్పిస్తుంటే, ఇక్కడ ఇలా దౌర్జన్యం జరుగుతోంది,” అని బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటి అక్రమ దందాలకు పాల్పడితే పేద ప్రజలు, లారీ ఓనర్లు బతకడం కష్టమని వారు అంటున్నారు. ఈ అక్రమ వసూళ్ల కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన ప్రజలు, లారీ యజమానులు తక్షణమే రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలని, పేద ప్రజలను, లారీ ఓనర్లను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లకు విన్నవించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియా దౌర్జన్యంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

