Home Andhra Pradesh సజ్జల సెటైర్లు.. రాష్ట్రంలో చంద్రన్న గుంతలు.!

సజ్జల సెటైర్లు.. రాష్ట్రంలో చంద్రన్న గుంతలు.!

Sajjala Satire Chandranna Gunthalu In Ap | Telugu Rajyam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రంలో రోడ్లపై గుంతలకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘అవి చంద్రబాబు హయాంలో పడిన గుంతలు.. వాటిని చంద్రన్న గుంతలనడం సబబు. ఆ గుంతల పేరుతో టీడీపీ రాజకీయం చేయడం తగదు. రోడ్లను బాగు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు..’ అని సెలవిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే, చంద్రబాబు హయాంలో రోడ్లకు గుంతలు పడితే, రెండేళ్ళలో ఆ గుంతల్ని పూడ్చేందుకు వైఎస్ జగన్ సర్కార్ చర్యలు తీసుకోకపోవడమేంటి.? ఇంకో మూడేళ్ళపాటు చంద్రన్న గుంతల్ని అలాగే వదిలెయ్యడానికే ప్రభుత్వం నిర్ణయించుకుందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు, పాలన ఎలా వున్నా, కొంతమంది వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి చేస్తున్న నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు వస్తోంది. రోడ్లపై గుంతలకు సంబంధించి చంద్రన్న గుంతలంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో చాలా రహదార్లు గడచిన రెండేళ్ళలో అత్యంత దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ గుంతల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతూ వస్తోంది. రోడ్లపై గుంతల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సంగతినీ చూస్తున్నాం. ఈ గుంతల విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకింత బాధ్యతాయుతంగా మాట్లాడి వుంటే బావుండేదేమో. గత కొద్దిరోజులుగా టీడీపీ శ్రేణులు, రోడ్లపై గుంతల్లో చేపల్ని వదులుతుండడం, వరి నాట్లు వేస్తుండడం ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

Related Posts

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News