Roja: బడా ఇంటికి కోడలిగా వెళ్ళబోతున్న రోజా కూతురు అన్షు… ఫుల్ క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి!

Roja: సినీ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రోజా ఒకరు. ఈమె చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగి పద్మావతి మహిళ యూనివర్సిటీలో చదువులను పూర్తి చేశారు చదువుతున్న సమయంలోనే నటనపై ఆసక్తి ఉండడంతో ఈమె అటువైపుగా ప్రయత్నాలు చేశారు. తపస్సు అనే సినిమా ద్వారా మొదటి సారి స్క్రీన్ పై కనిపించే సందడి చేస్తున్న రోజా అనంతరం తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న రోజా 2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆ సమయంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఈమె కొన్ని అనుకోని కారణాలవల్ల పార్టీ మారాల్సి వచ్చింది. వైయస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. ఇక 2014 ,19లో నగరి నియోజకవర్గంలో నుంచి ఈమె విజయం సాధించి ఎమ్మెల్యే గాను,ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా, మంత్రిగా పనిచేశారు అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమిపాలయ్యారు.

ఇలా ఓటమి పాలు కావడంతో కొద్దిరోజుల పాటు సైలెంట్ అయిన రోజే తిరిగి రాజకీయాల పరంగా ఎంతో యాక్టివ్ అవుతూ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు తన కుమార్తె గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రోజా కుమార్తె ఓ బడా స్టార్ ఫ్యామిలీకి కోడలుగా అడుగు పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలు పై రోజా స్పందించ క్లారిటీ ఇచ్చారు.

తన కూతురు పెళ్లి గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో నిజం లేదని తెలిపారు .ప్రస్తుతం తన కుమార్తె చదువుల నిమిత్తం అమెరికాలో ఉంది అయితే తన కూతురు నటనలో శిక్షణ తీసుకోవడం కోసం వెళ్ళిందని అందరూ భావిస్తున్నారు. కానీ ఆమె పూర్తిగా చదువుల కోసమే వెళ్ళిందని తెలిపారు. నాలా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే సంతోషమే కానీ తన కూతురికి సైంటిస్ట్ అవడం ఇష్టమని అదే దిశగా ఆమె చదువులు కూడా చదువుతోందని పిల్లల ఇష్టం పై మన ఇష్టాలను ఎప్పటికీ రుద్దకూడదు అందుకే వారికి నచ్చిన రంగంలోనే మేము ప్రోత్సహిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.